Chandra Babu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా 2027 వ సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించాలని ఇందుకు సంబంధించిన బిల్లుకు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో కూడా ఆమోదం తెలుపబోతున్నారని తెలుస్తోంది.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లను చేస్తుంది. ఇక ఈ ఎన్నికలకు మద్దతుగా ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా నిలిచారు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో సభ్యులు కావడంతో జమిలి ఎన్నికలకు ఈయన కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.
గతంలో జమిలి ఎన్నికలకు తాము కూడా అనుకూలమే అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఈ ఎన్నికల విధానంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగిన ఏపీలో మాత్రం ఈ ఎన్నికలు జరగవని తెలిపారు. 2029 ఎన్నికల సమయం పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి తప్ప ముందస్తు ఎన్నికలు అసలు రావని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Chandra Babu:ముందస్తు ఎన్నికలు లేవు…
ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి జమిలి విధానానికి అన్ని రాష్ట్రాలు కట్టబడి ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు జరగవనే విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.



































