Connect with us

Featured

Allu Arjun: పుష్ప 2 విషయంలో పవన్ కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేసిన అల్లు అర్జున్…వివాదానికి చెక్ పడిందా?

Published

on

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు మెగా కుటుంబంతో రాజీకి వచ్చారని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి కాకుండా వైకాపా నాయకుడికి అల్లు అర్జున్ మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లడంతో అప్పటినుంచి మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

ఇలా ఈ ఎన్నికల సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కానీ లేవని చెప్పాలి. అయితే ఈ వివాదానికి అల్లు అర్జున్ చెక్ పెట్టారని రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందని తెలుస్తోంది. త్వరలోనే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా విడుదల కాబోతోంది. డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నారు.

ఇక ఈ సినిమా వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు అయితే హైదరాబాదులో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమా వేడుక చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు దీంతో నిర్మాతలు ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 సినిమా వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు.

చీఫ్ గెస్ట్ గా పవన్..
ఈ క్రమంలోనే పుష్ప మేకర్స్ ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడగా అమరావతిలో ఈ సినిమా వేడుకను నిర్వహించడం కోసం ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈవెంట్ విషయంలో అల్లు అర్జున్ ఏకంగా పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి తనని ముఖ్య అతిథిగా ఆహ్వానించారని అందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

NBK109: బాలకృష్ణ బాబీ సినిమా టైటిల్ ఇదేనా.. పోస్టర్ వైరల్!

Published

on

NBK109: నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరో వైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలయ్య త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా మధ్యలో ఎన్నికలు రావడంతో బాలకృష్ణ రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగుకు పూర్తిగా విరామం ప్రకటించడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. గతంలో ఈ సినిమాకి ఫలానా టైటిల్ పెట్టబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో టైటిల్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం సర్కార్ సీతారాం అనే టైటిల్ పెట్టాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ తో కూడిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సర్కార్ సీతారాం..
రేపు టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు బాబి. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా తమన్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai pallavi: ఆర్మీ జవాన్ ను పెళ్లి చేసుకోను… పెళ్లిపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published

on

Sai pallavi: సినీనటి సాయి పల్లవి ప్రస్తుతం అమరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ మేజర్ ముకుంద జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరో శివ కార్తికేయన్ నటించగా సాయి పల్లవి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి పల్లవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీ తండ్రి కనుక మీకు ఒక ఇండియన్ ఆర్మీ ప్రపోజల్ తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ నేను ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ ను పెళ్లి చేసుకోవడం కంటే ఆ ఆర్మీలో వైద్యురాలిగా కొనసాగుతూ వారికి సేవ చేయడానికి ఇష్టపడతానని తెలిపారు. ఇలా సాయి పల్లవి వ్యాక్యలను బట్టి చూస్తే ఈమెకు ఇండియన్ ఆర్మీని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇష్టమైతే ఏమాత్రం లేదని తెలుస్తుంది.

అలాంటి ఆలోచన లేదు..
ఇక పెళ్లి గురించి కూడా సాయి పల్లవి మాట్లాడుతూ ఇప్పుడైతే తనకు పెళ్లి ఆలోచనలు ఏమాత్రం లేవని తెలిపారు. ఇలా సాయి పల్లవికి పెళ్లి ఆలోచన లేకపోవడంతో ఈమె కంటే ముందుగానే తన చెల్లెలు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో ఈమె నాగచైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..

Advertisement

Advertisement
Continue Reading

Featured

NTR: తొలిమెట్టు ఎక్కావు.. ఆల్ ది బెస్ట్ రామ్.. కొడుకుకు విషెస్ చెప్పిన ఎన్టీఆర్?

Published

on

NTR: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు కొనసాగుతున్నారు. నందమూరి తారక రామారావు హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన వారసులుగా హరికృష్ణ బాలకృష్ణ వంటి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక హరికృష్ణ కూడా పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయారు.

Advertisement

ఇక హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్ హీరోగా అడుగుపెట్టి హీరోగా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక హరికృష్ణకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు తారకరామారావు కావటం విశేషం. త్వరలోనే తారక రామారావు కూడా హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తాజాగా వైవిఎస్ చౌదరి ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు. దీంతో నందమూరి నాలుగో తరానికి సంబంధించిన హీరో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కు తన అన్నయ్య కుమారుడు అంటే తనకు వరుసకు కుమారుడు అవుతారని చెప్పాలి. ఇలా నందమూరి తారక రామారావు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలిపారు.

తొలిమెట్టు ఎక్కుతున్నావు ఆల్ ద బెస్ట్ రామ్. సినిమా ఇండస్ట్రీ నీకెన్నో మర్చిపోలేని అనుభూతుల్ని ఇస్తుంది. తప్పకుండా విజయం సాధిస్తావు నీకు మీ ముత్తాత ఎన్టీ రామారావు, మీ తాత హరికృష్ణ, మీ తండ్రి జానకిరామ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి అంటూ ఆల్ ద బెస్ట్ తెలియ చేస్తూ ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!