Connect with us

Featured

AP Politics: వైయస్ ఆస్తిని పేదలకు పంచాలి.. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు?

Published

on

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెల షర్మిల ఆస్తి వివాదం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వైయస్ జగన్ షర్మిల ఆస్తి వివాదంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల హడావిడి ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పాలి. వైయస్ జగన్ షర్మిల ఆస్తి వివాదం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత కుటుంబ విషయం.

Advertisement

ఈ విషయంపై కొంతమంది తెలుగుదేశం బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ధర్మవరం ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ సైతం షర్మిల జగన్ ఆస్తి వివాదం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తి సమస్యను ఇద్దరి తోడు దొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మండిపడ్డారు. తనకు రక్షణ కల్పించాలంటూ చెల్లి చేస్తున్న మరో కొత్త నాటకం మాయాబజార్ సినిమాను తలపిస్తోందని సత్యకుమార్ తెలిపారు. అక్రమంగా ఆస్తులను సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి.

బహిష్కరించాలి..
ఆ ఆస్తులను ఆ నలుగురు పిల్లలకు కాదు.. కోట్లాదిమంది పిల్లలకు పంచాలని అప్పుడే నిజమైన దీపావళి అంటూ ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ వైయస్ జగన్ షర్మిల ఆస్తి వివాదం గురించి చేస్తున్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ram Charan: ఏంటీ చరణ్ మా అన్నని కాపీ కొట్టావా…గేమ్ ఛేంజర్ పోస్టర్ పై బన్నీ ఫ్యాన్స్ ట్రోల్స్!

Published

on

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఎన్నో కొత్త సినిమాలు అప్డేట్స్ తెలియజేశాయి.

Advertisement

ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి దీపావళి పండుగను పురస్కరించుకొని బిగ్ అప్డేట్ మేకర్స్ ఇచ్చారు. రామ్ చరణ్ లుక్ కి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు.అది ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించినా కూడా ట్రోల్స్ మాత్రం ఆగటం లేదు. తాజాగా ఈ పోస్టర్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మాస్ లుక్ లో చరణ్…

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టి మాస్ లుక్ లో అదరగొట్టాడు. పట్టాలపై విలన్ మనుషులని రామ్ చరణ్ కొట్టి పడినట్టు తెలుస్తుంది. చరణ్ మాస్ లుక్ లో లుంగీ కట్టి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ చూసిన బన్నీ ఫాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే పుష్ప సినిమాలో అచ్చం అల్లు అర్జున్ లాగే కనిపించడంతో ఏంటి చరణ్ అన్న మా బన్నీ అన్నను చూసి కాపీ కొట్టావా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Rajinikanth: విజయ్ రాజకీయ బహిరంగ సభ పై స్పందించిన రజనీకాంత్.. ఏమన్నారంటే?

Published

on

Rajinikanth: తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, ఇటీవలే లక్షలాది మంది అభిమానులతో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా ఈ సభ ఎంతో విజయవంతం అవ్వడమే కాకుండా తమిళనాడు రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది.

Advertisement

ఇకపోతే ఈ బహిరంగ సభ గురించి ఇప్పటికే పలువురు వివిధ రకాలుగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇంటి ఎదుట ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విజయ్ ఎన్నికల బహిరంగ సభ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

విజయ్ రాజకీయ రంగ ప్రవేశం విజయవంతమైందని, టీవీకే పార్టీ తొలి బహిరంగ సభను చక్కగా నిర్వహించారని కొనియాడారు. విజయ్ తన పార్టీ సభను ఎంతో విజయవంతంగా నిర్వహించారని, అందుకు అతడిని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయవంతంగా నిర్వహించారు..
గతంలో కూడా రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని భావించారు అందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి కానీ అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది ఆయన శ్రేయోభిలాషులు ఇలాంటి టైంలో రాజకీయాలలోకి వెళ్లడం మంచిది కాదని సూచించడంతో రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న ఉదయనిది స్టాలిన్ కమల్ హాసన్ విజయ్ దళపతి వంటి వారందరూ కూడా రాజకీయాలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading

Featured

TTD: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్రిస్టియనా… అసలు నిజం ఏంటంటే?

Published

on

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలిని ఏర్పాటు చేస్తూ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీవీ 5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. ఆయనతోపాటు మరో 23 మందిని కలుపుకొని మొత్తం 24 మందికి టీటీడీలో స్థానం కల్పించారు.

Advertisement

ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బి ఆర్ నాయుడు నియమితులు కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు తీవ్రస్థాయిలో ఈయనపై విమర్శలు చేస్తున్నారు. బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అని తిరుమల తిరుపతి దేవస్థానికి ఒక క్రిస్టియన్ చైర్మన్ గా ఉండడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు.

ఇలా బిఆర్ నాయుడు గురించి వస్తున్నటువంటి వార్తలపై కూటమి ప్రభుత్వం స్పందించింది. బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ కొంతమంది ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇలా బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ వచ్చే వార్తలలో నిజం లేదని తేల్చి చెప్పారు.

హిందువులే ఉండాలి..
ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ ఉన్న సమయంలో వెనుక శిలువు ఆకారంలో ఉన్నటువంటి ఒక వస్తువు కనిపించడంతో ఆయన క్రిస్టియన్ అంటూ కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు కానీ ప్రభుత్వం స్పందించడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పడినట్టు అయింది. ఇక కొత్త చైర్మన్గా నియమితులైన బి.ఆర్ నాయుడు తిరుమలలో చాలా చేపట్టాల్సిన పనులు ఉన్నాయని గత ప్రభుత్వం దేవస్థాన ప్రతిష్టను దిగజార్చింది అంటూ ఈయన మండిపడ్డారు అలాగే ఆలయంలో పనిచేసే సిబ్బంది మొత్తం హిందువులే ఉండాలని ఈయన ఆదేశాలను జారీ చేశారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!