Connect with us

Featured

NTR: తొలిమెట్టు ఎక్కావు.. ఆల్ ది బెస్ట్ రామ్.. కొడుకుకు విషెస్ చెప్పిన ఎన్టీఆర్?

Published

on

NTR: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు కొనసాగుతున్నారు. నందమూరి తారక రామారావు హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన వారసులుగా హరికృష్ణ బాలకృష్ణ వంటి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక హరికృష్ణ కూడా పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయారు.

Advertisement

ఇక హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్ హీరోగా అడుగుపెట్టి హీరోగా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక హరికృష్ణకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు తారకరామారావు కావటం విశేషం. త్వరలోనే తారక రామారావు కూడా హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తాజాగా వైవిఎస్ చౌదరి ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు. దీంతో నందమూరి నాలుగో తరానికి సంబంధించిన హీరో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కు తన అన్నయ్య కుమారుడు అంటే తనకు వరుసకు కుమారుడు అవుతారని చెప్పాలి. ఇలా నందమూరి తారక రామారావు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలిపారు.

తొలిమెట్టు ఎక్కుతున్నావు ఆల్ ద బెస్ట్ రామ్. సినిమా ఇండస్ట్రీ నీకెన్నో మర్చిపోలేని అనుభూతుల్ని ఇస్తుంది. తప్పకుండా విజయం సాధిస్తావు నీకు మీ ముత్తాత ఎన్టీ రామారావు, మీ తాత హరికృష్ణ, మీ తండ్రి జానకిరామ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి అంటూ ఆల్ ద బెస్ట్ తెలియ చేస్తూ ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

NBK109: బాలకృష్ణ బాబీ సినిమా టైటిల్ ఇదేనా.. పోస్టర్ వైరల్!

Published

on

NBK109: నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరో వైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలయ్య త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా మధ్యలో ఎన్నికలు రావడంతో బాలకృష్ణ రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగుకు పూర్తిగా విరామం ప్రకటించడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. గతంలో ఈ సినిమాకి ఫలానా టైటిల్ పెట్టబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో టైటిల్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం సర్కార్ సీతారాం అనే టైటిల్ పెట్టాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ తో కూడిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సర్కార్ సీతారాం..
రేపు టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు బాబి. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా తమన్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai pallavi: ఆర్మీ జవాన్ ను పెళ్లి చేసుకోను… పెళ్లిపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published

on

Sai pallavi: సినీనటి సాయి పల్లవి ప్రస్తుతం అమరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ మేజర్ ముకుంద జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరో శివ కార్తికేయన్ నటించగా సాయి పల్లవి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి పల్లవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీ తండ్రి కనుక మీకు ఒక ఇండియన్ ఆర్మీ ప్రపోజల్ తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ నేను ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ ను పెళ్లి చేసుకోవడం కంటే ఆ ఆర్మీలో వైద్యురాలిగా కొనసాగుతూ వారికి సేవ చేయడానికి ఇష్టపడతానని తెలిపారు. ఇలా సాయి పల్లవి వ్యాక్యలను బట్టి చూస్తే ఈమెకు ఇండియన్ ఆర్మీని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇష్టమైతే ఏమాత్రం లేదని తెలుస్తుంది.

అలాంటి ఆలోచన లేదు..
ఇక పెళ్లి గురించి కూడా సాయి పల్లవి మాట్లాడుతూ ఇప్పుడైతే తనకు పెళ్లి ఆలోచనలు ఏమాత్రం లేవని తెలిపారు. ఇలా సాయి పల్లవికి పెళ్లి ఆలోచన లేకపోవడంతో ఈమె కంటే ముందుగానే తన చెల్లెలు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో ఈమె నాగచైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..

Advertisement

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: ఆ కారణంతో బన్నీ పై చెయ్యి చేసుకున్న చిరు… సీక్రెట్ బయటపెట్టిన చరణ్!

Published

on

Chiranjeevi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి ఏమాత్రం స్టార్ అనే గర్వం లేకుండా ఎంతో ఒదిగి ఉంటారు. ఇక చిరంజీవి క్రమశిక్షణకు మారు పేరు అనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Advertisement

నాన్న ప్రతి ఒక్క విషయంలోనూ చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఇక నేను ఆయన ప్రస్తుతం తన మూడ్ ఎలా ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విషయమైనా నాన్నతో మాట్లాడుతాను అలాంటి స్వేచ్ఛ నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఇచ్చారని చరణ్ తెలిపారు. అయితే ఓ సందర్భంలో నాగబాబు బాబాయ్ కారణంగా నాన్న చేత బెల్ట్ దెబ్బలు తిన్నానని చరణ్ తెలిపారు.

బయట సెక్యూరిటీ గొడవ పడుతూ ఏదో బూతు పదాలు మాట్లాడారు. ఆ పదాలకు అర్థం నాకు తెలియక నేను అప్పుడే బాబాయ్ రావడంతో బాబాయ్ ని కూడా అదే మాట అన్నాను వెంటనే షాక్ అయిన బాబాయ్ వెళ్ళి నాన్నకు చెప్పడంతో నాన్న తాత బెల్ట్ తీసుకొని బాగా కొట్టారు అదే నాన్న నన్ను ఫస్ట్ అలాగే చివరిగా కొట్టడం అని చరణ్ తెలిపారు.

ఎదురు తిరిగారు..
ఇక ఓ సందర్భంలో బన్నీని కూడా నాన్న కొట్టారని చరణ్ గుర్తు చేశారు. ఆడవాళ్ళని ఏదైనా అంటే నాన్నకు చాలా కోపం వస్తుంది. ఓసారి బన్నీ అత్తయ్యకు ఎదురు తిరిగారు. దీంతో నాన్న వెంటనే తనపై చేసుకున్నారని, మహిళలకు గౌరవించాలని నాన్న ఎప్పుడు చెబుతుంటారనీ చరణ్ ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!