Raj Tharun: రాజ్ తరుణ్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా అంటూ ఫోన్ చేశాడు.. మధునందన్ షాకింగ్ కామెంట్స్ !

Raj Tharun: ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధునందన్ అందరికీ సుపరిచితమే. తాజాగా మధునందన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రాజ్ తరుణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మధునందన్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు.

కరోనా లాక్ డౌన్ ముందు సమయంలో హీరో రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లారు. అయితే గోవా వెళ్లిన తర్వాత లాక్ డౌన్ విధించారు. అయితే రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవాలోనే చిక్కుకుపోయారు. ఇంట్లో రాజ్ తరుణ్ ఒక్కడే ఉన్నారు. ఆ సమయంలో కేవలం నిత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేది. ఇకపోతే లాక్ డౌన్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది అనుకుంటే సుమారు కొన్ని నెలల పాటు విధించారు.

ఇక రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవాలో ఉండిపోవడంతో రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు ఒక్కడినే ఉన్న ఇంకొక వారం ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటా అంటూ నాకు ఫోన్ చేశారు. అయితే ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో మాట్లాడారని మధునందన్ తెలిపారు.

ఇక ఆ సమయంలో నా ఫ్రెండ్ కి ఎసెన్సియల్ సర్వీస్ పాస్ ఉంది. దాంతో ప్రతి రోజు ఉదయం కారులో వెళ్లి కొన్ని రకాల పండ్లను ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పోలీసులకు అందించే వాళ్ళం. అయితే రాజ్ తరుణ్ ఫోన్ చేయగానే ఏం చేయాలి అని ఆలోచించగా నా ఫ్రెండ్ మాదాపూర్ వెళ్తున్నానని ఫోన్ చేశాడు. ఎలాగో మాదాపూర్ వెళ్తున్నావ్ కదా అలాగే గండిపేట వెళ్లి ఈ అడ్రస్ లో నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను.

ఇంటికి వెళ్లానని చెప్పాడు…


అక్కడికి వెళ్ళాడు రాజ్ తరుణ్ వచ్చి కారులో కూర్చోగానే ఒకసారిగా నా ఫ్రెండ్ ఆశ్చర్యపోయారు. ఎలాగలాగో రాజ్ తరుణ్ ను మా ఇంటికి తీసుకు వచ్చాము. అయితే మా అపార్ట్మెంట్ లో సుమారు 16 మంది చిన్న పిల్లలు ఉండేవారు వారందరితో రోజు ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేశాడు. సుమారు మూడు వారాలపాటు రాజ్ తరుణ్ మా ఇంట్లోనే ఉన్నాడు. అనంతరం లాక్ డౌన్ లో కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత రాజు తరుణ్ కి ఇంటికి వెళ్లాలని లేదని చెప్పారు. ఇక అప్పుడే తన ఫ్యామిలీ గోవా నుంచి రావడంతో రాజ్ తరుణ్ కూడా తన ఇంటికి వెళ్లి పోయారని ఈ సందర్భంగా మధునందన్ కరోనా సమయంలో రాజ్ తరుణ్ విషయంలో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.