Actor Ravi Varma : ఎన్టీఆర్ వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా?? నీకుంది తరువాత అని వార్నింగ్ ఇచ్చాడు…: నటుడు రవివర్మ

Actor Ravi Varma : వెన్నెల సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన రవి వర్మ సయ్యద్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈస్ట్ గోదావరికి చెందిన రవి వర్మ పెరిగింది చదివింది అంతా హైదరాబాద్ లోనే. ఇక అమెరికాలో మాస్టర్స్ చేసి అక్కడే పేరు మోసిన కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూనే యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసాడు. ఇక అలా వెన్నెల సినిమా అవకాశంతో 2005 లో వెండితెరపై కనిపించాడు. ఇక 2006లో ఏకంగా మూడు పెద్ధ సినిమాల్లో ఏకకాలం లో ఆఫర్స్ అందుకుని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ షేడ్ పాత్రలతో మెప్పిస్తున్న రవి వర్మ రాఖీ సినిమా అనుభవాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ తో చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది…

2006 సంవత్సరంలో ఒకవైపు రాఖీ, బొమ్మరిల్లు, సైనికుడు ఇలా మూడు సినిమాలలో చేసాడు రవివర్మ. అలా రాఖీ సినిమా గురించి చెబుతూ ఎన్టీఆర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని, తనతో చేస్తే పోటీ పడాలని ఛాలెంజింగ్ గా అనిపిస్తుందని చెప్పారు. తాను ఏదైనా నేను చేసేస్తా నువ్వు చేస్తావా అని పోటాపోటీగా చేస్తారు.

ఇక తన ఎనర్జీ లెవెల్స్ సూపర్ అంటూ అదే సమయంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అంటూ చెప్పారు. ఆ సినిమాలో తన చెల్లి భర్తగా చేసినపుడు ఒక సీన్ లో కాళ్ళు పట్టుకోవాలి. ఆ సీన్ కి నేను నీ కాళ్ళు పట్టుకోవాలా బయటికి రా చెప్తా అంటూ ఏడిపించాడు. నాకేం తెలియదు కృష్ణ వంశీ గారిని అడుగు అనేవాడిని కావాలాంటే సీన్ తీసేయించు అని చెప్పేవాడిని, సరదాగా అలా ఏడిపించేవాడు అంటూ రవి వర్మ ఎన్టీఆర్ తో వర్కింగ్ గురించి చెప్పారు.