Actor Shivaji : నేను ఎవరికీ బినామీ కాదు… ముష్టి ఎదవల దగ్గర ముష్టి అడుక్కునే రకం కాదు… నేను పత్తిత్తుల అమ్మ మొగుడిని…: నటుడు శివాజీ

Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించిన హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీకి కేఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ రాజకీయాల వైపు వచ్చి గరుడపురాణం అంటూ ఆ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. తాజగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లోని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

నేను ఎవరికీ బినామి కాదు…

నటుడు శివాజీ మొదట బీజేపీ లో చేరి ఆ తరువాత ఆ పార్టీ నుండి బయటికి వచ్చేసారు. మోడీ చేసిందేమి లేదంటూ ప్రత్యేక హోదా కోసం చలసాని శ్రీనివాస్ లాంటి వ్యక్తులతో కలిసి సాధన కమిటీ ఏర్పాటు చేసారు. ప్రత్యేక హోదా ఒకరిచ్చేది కాదు మన హక్కు మనమే పోరాడి సాధించుకోవాలి అంటూ చెప్పే శివాజీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడారు.

శివాజీ టీడీపీ కి సపోర్ట్ గా ఉంటున్నారు అనే వ్యాఖ్యలకు క్లారిటీ ఇస్తూ తాను అన్ని పార్టీలకూ సమాన దూరం పాటిస్తున్నట్లు చెప్పారు. అలాగే తానెవరికీ బినామి కాదని అవన్నీ అపోహలంటూ చెప్పారు. సినిమాల్లో నటించినపుడు సంపాదించిన డబ్బు భూమి మీద పెట్టడం వల్లే ఇప్ప్పటికీ జీవనాధారం అవుతోందని చెప్పారు. చాలా మంది మేము పత్తిత్తులం అంటుంటారు. నేను ఆ పత్తిత్తులకు అమ్మ మొగుడిని అంటూ ఫైర్ అయ్యారు శివాజీ. ఒకరికి బినామీగా ఉంటూ ముష్టి అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ తన మీద వచ్చిన రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు.