Allu Arjun: నటుడు అల్లు అర్జున్ ఇంట్లో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Allu Arjun: దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. రాఖీ పండుగ సందర్భంగా సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు వారి ఇంట కూడా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయని తెలుస్తుంది.

అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కి అల్లు అర్హ రాఖీ కట్టి తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అయాన్ సైతం అర్హ కోసం బోలెడు గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక అర్హ స్నేహ రెడ్డి చెల్లెలు పిల్లలకి కూడా రాఖీ కట్టి రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Allu Arjun: రాఖీ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్..


ఈ విధంగా అల్లు అర్జున్ పిల్లలు మాత్రమే కాకుండా ఈ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ కూడా భాగమయ్యారు అల్లు అర్జున్ కాజల్ సిస్టర్ అల్లు అర్జున్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్నేహ రెడ్డి ఈ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.