Connect with us

Featured

Arjun Sarja : మొదట్లో నేను ఏడవమంటే నవ్వాను.. దర్శకుడు నన్ను కొట్టారు.. ఇప్పటికీ నా సినిమాలు చూసి, నా పిల్లలు ఎగతాళి చేస్తుంటారు. : అర్జున్

Published

on

Arjun Sarja : శక్తి ప్రసాద్‌కి అర్జున్ సర్జా జన్మించాడు. అతని తల్లి లక్ష్మి ఆర్ట్ టీచర్. అతనికి ఒక అన్నయ్య కిషోర్ సర్జా కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అర్జున్ ఎప్పుడూ పోలీసు అధికారి కావాలని కలలు కనేవాడు కానీ అతని విధి అతనిని పూర్తిగా భిన్నమైన దిశలో తీసుకువెళ్లింది.

Advertisement

కన్నడ చిత్రాలలో ప్రముఖ నటుడు అయిన అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్, తన కొడుకు నటుడిగా మారడం ఇష్టం లేదు మరియు యుక్తవయసులో అర్జున్ అందుకున్న సినిమా ఆఫర్లను తిరస్కరించాడు. చలన చిత్ర నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు శక్తి ప్రసాద్ యొక్క అనుమతి లేకుండా తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభించడానికి అర్జున్‌ని ఒప్పించగలిగారు. ఆ తరువాత అతని తండ్రి అర్జున్ సినిమాలోకి వెళ్లడానికి అంగీకరించారు. సింహద మరి సైన్య (1981) చిత్రంలో అతను జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మరియు ఆ చిత్ర దర్శకుడు అతని అసలు పేరు అశోక్ బాబు స్థానంలో అర్జున్ అనే స్టేజ్ పేరుని ఇచ్చాడు. అతను కన్నడ చిత్రాలో నటించడం ప్రారంభించారు. అర్జున్ నటుడు-నిర్మాత AVM రాజన్ నుండి ఒక మూవీ ఆఫర్ అందుకున్నాడు. మరియు దర్శకుడు రామ నారాయణన్ తమిళ చిత్రం నంద్రి (1984) చేశారు.

నటుడిగా అతని కెరీర్ 1980ల మధ్యలో ప్రారంభమైంది. అర్జున్ కొన్నిసార్లు ఒక రోజులో అనేక షిఫ్టుల్లో పనిచేసేవాడు. 1990 నాటికి, అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ విలువను కోల్పోయాయి మరియు అతను దాదాపు ఒక సంవత్సరం పాటు తమిళం మరియు తెలుగు చిత్రాలలో పని చేయలేదు. అలా కొంతకాలం గడిచాక తిరిగి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1993లో వచ్చిన “జెంటిల్మెన్” చిత్రం అర్జున్ ని తిరిగి సినీ ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఆ తర్వాత అనేక తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఈ మధ్యకాలంలో హీరో అర్జున్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను మొదటగా నటించిన చిత్రంలోని ఒక సన్నివేశంలో సరిగా నటించకపోవడంతో దర్శకుడు ఏడవమంటే తెలియక నవ్వానని దానికి ఆగ్రహించిన దర్శకుడు చెంపపై కొట్టారని.. మొదట్లో నాకు నటన అంటే ఏమి తెలియదు. దర్శక నిర్మాతలు నా బాడీ చూసి హీరోగా పనికి వస్తారని అనుకున్నారు.

తిరిగి సినిమాలకి దూరంగా వెళ్లి పోదామనుకున్నాను. ఆ తర్వాత తెలుగులో 1985లో కోడి రామకృష్ణ “మా పల్లెలో గోపాలుడు” చిత్రంతో హీరోగా అవకాశం కల్పించారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. అలా కొన్ని తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో చేసిన తర్వాత నటనపై అవగాహన పెరిగిందని… ఇప్పటికీ నా పిల్లలు ఐశ్వర్య, అంజన నా మొదటి చిత్రాల్లోని నన్ను, నా నటన చూసి ఎగతాళి చేస్తుంటారు. నేను అందులో బాగోలేనని చెప్తుంటారు. అప్పటి నా సినిమాలను చూడడానికి నేను అంతగా ఇష్టపడనన్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి తనకు వెంకన్నబాబు మేనేజర్ గా ఉండేవారని అలా చిరంజీవితో పరిచయం ఉండేదని ఆ తర్వాత ఆయన, నేను కలిసి శ్రీ మంజునాథ చిత్రంలో నటించాం. ఆ చిత్రంలో నా నటనను అభినందిస్తూ చిరంజీవి ఫోన్ చేసి ఒక రోజు చెప్పారని ఆ ఇంటర్వ్యూలో హీరో అర్జున్ చెప్పుకొచ్చారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Chandra Babu Naidu: పొత్తు ఆలోచన ఎవరిది… జైలు గోడల మధ్య జరిగింది ఇదేనా?

Published

on

Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలను ఈయన వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ తో పొత్తు గురించి కూడా బాబు కీలక విషయాలు వెల్లడించారు.

Advertisement

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు సుమారు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత బయటకు వచ్చి టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తర్వాత అంతా తెలిసిందే. ఆరోజు జైలులో జరిగిన ఈ మీటింగ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.

ఈ పొత్తు ఆలోచన ఎవరిది అనే విషయంపై తాజాగా బాలయ్య ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.జైలులో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌, లోకేష్ వచ్చి నన్ను కలిశారు. పవన్‌ కల్యాణ్ తో నేను 2 నిమిషాలు మాట్లాడాను. ‘ధైర్యంగా ఉన్నారా సార్’ అని పవన్ అడిగారు. ‘ నా జీవితంలో నేనెప్పుడూ అధైర్య పడలేదు. భయపడను. మీరు కూడా ధైర్యంగా ఉండండి’ అని పవన్ తో చెప్పాను.

అదే విజయానికి నాంది..
రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానని పవన్ చెప్పారు. ఆ సమయంలో నేనే పొత్తు గురించి ఓసారి ఆలోచించండి కలిసి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పాను ఆ విషయంపై ఆలోచించిన పవన్ నేను బీజేపీకి కూడా నచ్చజెప్పి ఈ కూటమిలోకి తీసుకువస్తానని చెప్పాడు. ఆ తరువాత బయటకు వెళ్లి పవన్ కూటమి ప్రకటన చేశారు. అదే తమ విజయానికి నాంది అంటూ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Chandra Babu Naidu: చనిపోతే ఒక్క క్షణమే… అరెస్టు విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేనిది: చంద్రబాబు

Published

on

Chandra Babu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

Advertisement

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ ఆ రోజు నంద్యాల పర్యటన పూర్తిచేసుకుని తాను బస్సులో రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ బయట అలజడి వాతావరణం సృష్టించారు. నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారు.

ఇలా నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా అడవులలో అమరావతికి తీసుకువచ్చారు. ఇక అమరావతికి వచ్చిన తరువాత రాత్రంతా విచారణ పేరుతో అక్కడ ఇక్కడ తిప్పారు. మరుసటి రోజు ఉదయం మెడికల్ టెస్ట్ ల కోసం పంపించారు అలాగే కోర్టుకు తీసుకెళ్లి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేశారు.

ఆశయం కోసం..
ఇక ఆరోజు అర్ధరాత్రి నన్ను రాజమండ్రి జైలుకు పంపించారు. ఇక జైలులో కొన్ని సందేహ సంఘటనలు జరిగాయని కానీ నేను భయపడకుండా వాటిని ఎదుర్కొన్నాను కాబట్టి నేడు ఇక్కడ ఉన్నాను లేకపోతే ఏమై ఉండేదో చెప్పలేమంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము అని అన్నారు. దీంతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai Dharam Tej: పవన్ మామయ్య లేకపోతే నేనులేను.. అలా ప్రాణాలతో బయటపడ్డా: సాయి ధరమ్ తేజ్

Published

on

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల సోషల్ మీడియాలో అలాగే కెరియర్ పరంగా కూడా చాలా బిజీగా, యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా సాయి తేజ్ హైదరాబాద్‌లో జాతీయ దినపత్రిక, వెబ్ సైట్ ఏబీపీ నిర్వహిస్తున్న ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయి తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయనే నాకు గురువు. సినిమాలలో నటించాలని ఆసక్తి ఉందని తెలియగానే నటనలో,ఫైట్స్, కిక్ బాక్సింగ్‌ ట్రైనింగ్ ఇచ్చాడు.నా జీవితానికి కావాల్సిన కీలక విషయాలకు స్పూర్తి అందించారు. ఆయన నా గైడ్. నన్ను అలా నడిపిస్తుంటాడు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

బ్రో సినిమాలో ఆయనతో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అదే నేను తనకిచ్చిన గురుదక్షిణ అంటూ సాయి తేజ్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ జాగ్రత్తలను కూడా తెలియజేశారు. ఈయన బైక్ పై ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.

హెల్మెట్ తప్పనిసరి..
అప్పటినుంచి ఈయన ఏ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి జాగ్రత్తలను తెలియజేస్తూ ఉంటారు. బైక్ మీద ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఆ హెల్మెట్ నన్ను ప్రాణాలతో నిలబెట్టింది అంటూ సాయిధరమ్ తేజ్ మరోసారి తనకు జరిగిన యాక్సిడెంట్ సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!