ఎన్నో జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం గడ్డిచేమంతి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

సాధారణంగా మనం చిన్నప్పుడు బోర్డు బాగా రాయడానికి ఒక ఆకును తీసుకువచ్చి బోర్డుపై బాగా రుద్దుతాము. ఈ కలుపు మొక్క అనేక ప్రాంతాలలో, పొలం గట్లలో విపరీతంగా పెరిగిటటువంటి గడ్డి జాతి మొక్క. ఈ గడ్డి జాతి మొక్క పువ్వులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ మొక్కలలో, పుష్పాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా అధిక జుట్టు సమస్యతో బాధపడే వారికి గడ్డిచామంతి మొక్క ఒక వరమని చెప్పవచ్చు. గడ్డి చామంతి మొక్కను ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం…

ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ గడ్డిచామంతి మొక్కను ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగించేవారు. ఏదైనా గాయాలు తగిలి అధిక నొప్పిని కలుగజేస్తూఉంటే ఆ ప్రదేశంలో గడ్డి చేమంతి ఆకురసం రాయటం వల్ల తొందరగా గాయం నయం అయ్యేది. అదేవిధంగా గడ్డి చేమంతి ఆకు రసాన్ని ఇప్పటికీ పల్లెల్లో పశువులకు గాయాలు తగిలినప్పుడు ఆ గాయాలు మానడానికి ఉపయోగిస్తారు. ఈ గడ్డి చేమంతి ఆకులలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి తొందరగా గాయాన్ని నయం చేయడానికి ఉపయోగపడతాయి.

గడ్డి చామంతిలో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వెన్నునొప్పి నడుం నొప్పి నివారణకు ఎంతో ఉపయోగపడతాయి.ట్రైడాక్స్ ప్రొక్యూంబెన్స్ అనేది జుట్టు పెరుగుదలకు సాంప్రదాయకంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషధం ఇది గడ్డిచామంతి లో అధికంగా ఉండటం వల్ల అధిక మొత్తంలో జుట్టు రాలుతున్న ఏ ఇతర జుట్టు సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారమవుతాయి. అలాగే తెల్లబడిన జుట్టు నల్లగా మార్చడానికి గడ్డిచామంతి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడదను నివారించడానికి మంచి కీటక సంహారినిగా గడ్డిచామంతి ఉపయోగపడుతుంది.