Gandhi Hospital Superintendent : ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ లో ఏముంది… పోస్టుమార్టం రిపోర్ట్ ఏం చెప్తోంది…: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం

Gandhi Hospital Superintendent : కాకతీయ మెడికల్ పీజీ స్టూడెంట్ ప్రీతి కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ అలాగే టాక్సికాలజీ రిపోర్ట్ కీలకం కానున్నాయి. పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి డ్యూటీలో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 22నాడు ప్రీతి ఆత్మహత్యా యత్నం చేయగా ఆ మరుసటి నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ప్రీతి మరణించిన తరువాత ఆమె చనిపోవడానికి కారణాలు ఏమిటి అన్న కోణంలో దర్యాప్తు సాగుతుండగా అందులో భాగంగా ఆమె రక్తంలో విషపూరిత పదార్థాల మోతాదు, ఎలాంటి హానికరం పదార్థాలు ఉన్నాయనే విషయాలు రిపోర్ట్ లో తెలుస్తాయి.

టాక్సికాలజీ రిపోర్ట్ లో ఏం తెలియనుంది…

గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం గారు మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ కానీ టాక్సికాలజీ రిపోర్ట్ కానీ రెండు ఎవరి చేతికీ ఇవ్వరని, సీల్డ్ కవర్ లో సంబంధిత పోలీసు అధికారికి మాత్రమే ఇస్తారని, ఆ రిపోర్ట్ ను పోలీసులు అధికారులు కోర్ట్ లో సమర్పిస్తారని తెలిపారు. బయటికి రిపోర్ట్ వివరాలు తెలియనివ్వరిని పోస్టుమార్టంలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయని తెలిపారు.

ప్రైమరి పోస్టుమార్టంలో మొత్తం శరీర భాగాలను ఎక్సామిన్ చేస్తారు. ఇక ఈ రిపోర్ట్ తో పాటు కడుపులో ఉన్న పదార్థాలను అలాగే వివిధ శరీర భాగాలను పాథాలజీ విభాగనికి పంపి వివరాలను సేకరిస్తారు. ఇక రక్తం నమూనాలను పంపి టాక్సికాలజీ రిపోర్ట్ మొత్తం కలిపి ఫైనల్ పోస్టుమార్టం రిపోర్ట్తో కలిపి ఇస్తారు అంటూ డాక్టర్ రాజారాం తెలిపారు.