Connect with us

Featured

ఆ దర్శకులిద్దరి సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే !

Published

on

కొంతమందిని చూస్తే ఇతను నటుడా.. అనే సందేహం కలగక మానదు. కానీ అతనే మొహానికి రంగేసుకున్నా.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే ఆ పాత్ర కామెడి, విలన్.. ఇలా ఎటివంటి పాత్ర అయినా విజృంభనే. అలాంటి గొప్ప నటులలో ఒకరు రాళ్ళపల్లి. ఆయన పోషించిన చాలా పాత్రలకి ప్రాణం పోశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో ఆగస్టు 15 1945లో పుట్టారు. బీకామ్‌ పూర్తి చేసిన రాళ్ళపల్లికి టెన్త్‌, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్స్‌తోనే రైల్వేలో క్లాస్‌ ఫోర్‌ జాబ్‌ అంటే ప్యూన్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 1970 ప్రారంభంలో ఢిల్లీలోని ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’ అనే ప్రభుత్వ సంస్థలోకి మారారు.

Advertisement

అప్పట్లో దాదాపు వెండితెర మీద వెలిగిన నటులలో ఎక్కువ శాతం నాటరంగంలో గొప్ప అనుభవం సంపాదించి వచ్చిన వారే. ఆ కోవలోనే రాళ్ళపల్లి కూడా వస్తారు. ఆయన కూడా పలు నాటకాలు వేసి గుర్తింపు తెచ్చుకొని సినిమా రంగంలో అడుగుపెట్టారు. రాళ్ళపల్లికి విపరీతంగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. ఆయన చదువుకునే రోజుల్లోనే కాలేజీలో పోటీలు నిర్వహించారు. ఇందుకోసం రాళ్ళపల్లి ‘మారని సంసారం’ అనే నాటిక ఒకటి రాశారు. దీనికి రచన, నటన రెండు విభాగాలలోను అవార్డులు
దక్కాయి.

ప్రముఖ సినీనటి భానుమతి రామకృష్ణ చేతుల మీదుగా రాళ్ళపల్లి ఆ అవార్డులు అందుకున్నారు. నాటకమంటే ప్రాణమిచ్చే రాళ్ళపల్లి, అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిహార్సల్‌ మొదలుపెట్టేవారు. ఆయన వేసే నాటకాలు సినిమా స్థాయిలో ఉండేవంటే నమ్మి తీరాల్సిందే. అంతేకాదు నాటకాల కోసం ఖర్చంతా ఆయనే పెట్టుకునేవారు. కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో నాటకం కోసం అప్పులు కూడా చేశారు. అప్పుల నేపథ్యంలోనే ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాసి, దాదాపు వందకు పైగా ఆ నాటకాలను ప్రదర్శించి, వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకునేలా రూపొందించారు.

నాటక రంగంలో అంత సుధీర్ఘ అనుభవం సంపాదించిన రాళ్ళపల్లి తన భార్య సహకారంతో సినిమాలలోకి వచ్చారని చెప్పాలి. ప్రముఖ నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పత్రికలో ఓ ప్రకటన చూసిన రాళ్ళపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని దృష్ఠిలో పెట్టుకొని దరఖాస్తు చేయమని సపోర్ట్ చేశారు. “చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది. పనికొస్తే చూడండి” వినూత్నంగా అంటూ దరఖాస్తు పెట్టారు రాళ్ళపల్లి. అది చూసిన దర్శక, నిర్మాతలు ఆయనని ఇంటర్వ్యూకు పిలిచారు. సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, పాటల రచయిత సినారె సమక్షంలో ఒక సీన్‌ కెమెరా ముందు నటించి చూపించి ‘ఊరుమ్మడి బతుకులు’ అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు.

అయితే దీనికంటే ముందే రాళ్ళపల్లి 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977లో నటించిన ‘ఊరుమ్మడి బతుకులు’ పాపులారిటీ సాధించి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు. ముఖ్యంగా ఆయనలోని కమెడియన్ ని బయటకి తీసుకు వచ్చిన దర్శకులు, జంధ్యాల, వంశీ. వీరి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్నీ సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకునేది. ఆయనను నమ్మి దర్శకులు సృష్ఠించిన పాత్రలకి నిజంగానే ప్రాణం పోయడానికి తన శాయశక్తులా తాపత్రయపడేవారు. మణిరత్నం ‘బొంబాయి’ సినిమాలో హిజ్రాగా నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 15న కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి 50వేల రూపాయలు ఇచ్చేవారంటే కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకి ఉన్న గౌరవం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 850 కి పైగా చిత్రాలలో నటించిన రాళ్ళపల్లి చివరిగా నాని – మారుతి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రంలో నటించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!