Animal Movie: సమాజం పట్ల నిర్మాతలకు బాధ్యత ఉండాలి కదా… యానిమల్ మూవీ పై జయప్రకాష్ నారాయణ కామెంట్స్!

Animal Movie: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించినటువంటి తాజా చిత్రం యానిమల్ ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపించారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ అనిల్ కపూర్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీగా సక్సెస్ అందుకోవడంతో కొందరు మాత్రం ఈ సినిమా పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇటీవల పార్లమెంటులో కూడా ఈ సినిమా గురించి ఒక ఎంపీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల కారణంగా మనుషులు మారిపోరు కానీ వారి ఆలోచన విధానం పై ఇలాంటి సినిమాలు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు.
ఇలాంటి సినిమాలు చేసే విషయంలో నిర్మాతలు కూడా సమాజం పట్ల కొంత బాధ్యత ఉండాలి అని తెలిపారు.

సినిమాల వల్ల ఆలోచనలు మారకూడదు..

సినిమా చేయటం వల్ల మంచి ఆలోచనలు రాకపోయినా పర్వాలేదు కానీ చెడు ఆలోచనలు వచ్చేలా సినిమాలు చేయకండి అంటూ ఈయన తెలిపారు. సమాజంలో జరిగే తప్పులకు పూర్తి భాద్యత సినిమాలు అనడం లేదు. అలా అనడం కూడా తప్పు. కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం సమాజం పై భాద్యత వహించి సినిమాలు చేయడం మంచిదని తెలిపారు. ఇలాంటి సినిమాలు చేయడం వల్ల చిన్న పిల్లల పై కూడా ప్రభావాన్ని చూపుతాయని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.