Connect with us

Featured

Real Doctors in TOLLYWOOD : మన తెలుగు సినిమాలలో అసలైన డాక్టర్స్ ఎవరో తెలుసా.?!

Published

on

Real Doctors in TOLLYWOOD : ఒకసారి సినిమాలన్నీ తిరగేస్తే డాక్టర్ క్యారెక్టర్ లేని చిత్రాలు అత్యల్పంగ కనిపిస్తాయి. సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ లెంతీగా లేనప్పటికీ.. అది ఒక సందర్భంలో సినిమాలోని కథకు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది. అలాగే కథ మొత్తం డాక్టర్ చుట్టూ తిరిగే సినిమాలు కూడా వచ్చాయి. ఇకపోతే వీరంతా నిజమైన డాక్టర్స్ కాదు. కాకపోతే కొంతమంది నటీ నటులు వైద్య విద్యను అభ్య సించి లేదా ఆ వృత్తిలో కొనసాగిన కొంతమంది డాక్టర్స్ మన సినిమాలలో నటులుగా స్థిరపడిపోయారు.

Advertisement

అల్లు రామలింగయ్య నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు.

మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యసేవ లందించేవాడు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మేన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ యొక్క తల్లిదండ్రులు వరదరాజన్‌ గోపాల్‌, ఆండాళ్ పిళ్ళై. తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్. సి. సి విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్నా తండ్రి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది.
1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దురు కూతుర్లు శివాని, శివాత్మిక. పెద్ద కూతురు శివాని ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసి సినిమాలోకి అడుగుపెట్టింది.

చక్కటి అభినయం, కుటుంబ కథలతో అశేష తెలుగు ప్రేక్షక అభిమానులను పొందిన నటి సౌందర్య. ఈమె సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. తరువాత ఆమె తెలుగు చిత్రరంగలోకి ప్రవేశించి, ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది.

సాయి పల్లవి ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు. మెడిసిన్ నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది.ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమాతో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Rashmika: ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్స్ అవుతాం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు కానీ ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఇక త్వరలోనే ఈమె నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డీ గ్లామర్ పాత్రలో నటించాలి అంటే మామూలు విషయం కాదు. మేకప్ వేయటం కోసమే ఎన్నో గంటల సమయం పడుతుంది. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కోసం రష్మిక చాలా ఇబ్బందులు పడినట్లు ఈమె తెలిపారు.. మేకప్ కోసం గంటలు కూర్చుని వేయించుకోవాలని మేకప్ ఎక్కడ చెరిగిపోతుందోనని కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కేవలం లిప్స్ ఒక్కటే క్లియర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తాగేదానినని తెలిపారు.

మేకప్ రిమూవ్..
ఇక ఇలాంటి మేకప్ వేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేయాలంటే ఎంతో నొప్పిగా ఉండేది అలాంటి నొప్పిని మనం భరించినప్పుడే హీరోయిన్స్ గా సక్సెస్ అవుతాము అంటూ రష్మిక పుష్ప సినిమాలోని డీ గ్లామర్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nagachaitanya: ఆ కారణంతోనే రేస్ కార్ల జోలికి వెళ్ళలేదు…చైతన్య కామెంట్స్ వైరల్!

Published

on

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈయన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా తనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటినుంచి కూడా నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. తనకు ఏదైనా కొత్త రకం బైక్ లేదా కారు కనిపిస్తే అసలు ఆగలేనని వెంటనే డ్రైవ్ చేస్తానని నాగచైతన్య తెలిపారు.

ఇటీవల కాలంలో తాను కార్ రేసింగ్ జోలికి వెళ్లలేదని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అదేవిధంగా నా స్నేహితులు తాను ఈ అలవాటు మానుకుంటే మంచిదని చెప్పడంతో ఈ అలవాటును కాస్త తగ్గించుకుంటున్నానని తెలిపారు. తాను రేస్ వెళ్లేటప్పుడు చాలా వేగంగా వెళ్తాను అందుకే ఈ అలవాటు మానుకోమని తన స్నేహితులు చెప్పారని చైతన్య వెల్లడించారు.

జాలరి నేపథ్యంలో..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే నిజ జీవిత కథ ఆధారంగా ఓ జాలరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!

Published

on

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.

రామ్ చరణ్ కు పోటీగా చైతన్య..
ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!