Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్.. మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు..! ఎంత చెల్లించాలంటే..!

Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్.. మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు..! ఎంత చెల్లించాలంటే..!

Medaram Jatara Buses: టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చినప్పటి నుంచి ఆర్టీసీలో సంస్కరణలు మొదలుపెట్టారు.

Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్.. మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు..! ఎంత చెల్లించాలంటే..!
Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్.. మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు..! ఎంత చెల్లించాలంటే..!

ఇటు లాభంతో పాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో పెద్దపీట వేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే గతంలో హైదరాబాద్ లో టీ24 టికెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 100తో టీ24 టికెట్ ని తీసుకుంటే ఒకరోజు మొత్తం నగరంలోని ఆర్టీసీ సీటి బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు.

Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్.. మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు..! ఎంత చెల్లించాలంటే..!

ఈ టీ24 టికెట్ కు ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది రోజూ వారీ పాస్ గా పనిచేస్తోంది. 24 గంటలు కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ లో తీసుకువచ్చిన ఈ విధానాన్నే వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది.

51 పాయింట్స్ ద్వారా మేడారానికి ..

ఈనగరాల్లో టీ24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. మేడారం జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఈ విధానాన్ని ఈమూడు నగరాల్లో అమలులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. టీ24 టికెట్ తీసుకుని ఈ మూడు నగరాాల్లో ఎక్స్ ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో 24 గంటలపాటు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. నిన్నటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మేడారం జాతర సందర్భంతగా టీఎస్ఆర్టీసీ 3845 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. 51 పాయింట్స్ ద్వారా మేడారానికి బస్సుల్ని నడుపుతున్నారు. వరంగల్ జిల్లాలోని30 బస్ పాయింట్ల నుంచి బస్సుల్ని నడుపుతున్నారు. భక్తులను జంపన్న వాగుకు తరలించేందుకు ఫస్ట్ టైమ్ మినీ బస్సుల సౌకర్యాన్ని కల్పించారు.