Connect with us

Featured

Suriya: నేను ఆరువేల మందిని చదివించడానికి ఆయనే కారణం.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published

on

Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు సూర్య తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా ఈయన భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడంతో సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.

Advertisement

సూర్య త్వరలోనే కంగువ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. డైరెక్టర్ శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత రాత్రి వైజాగ్ లో ఈ సినిమా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. నాకు నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నాకు విషెస్ తెలిపారు. కాని చిరంజీవి గారు మాత్రం డైరెక్ట్ గా కాల్ చేసి నాకు విష్ చేయడమే కాకుండా నాతో ఎన్నో విషయాలు మాట్లాడారని తెలిపారు.

చిరంజీవి స్ఫూర్తి…
ఇక నన్ను చిరంజీవి గారు ఇంటికి పిలిచి మరి ఆయనే స్వయంగా ఫిష్ కర్రీ దోశ చేసి పెట్టారు. ఇక నేను చెన్నైలో ఇల్లు కట్టుకొని ఎన్జీవో సంస్థలు నడపడానికి ఇప్పటివరకు 6000 మందికి పైగా స్టూడెంట్స్ చదువు విషయంలో హెల్ప్ చేయడానికి కారణం చిరంజీవి అని తెలిపారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకుని నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను. ఇటీవల చిరంజీవి గారిని పర్సనల్ గా కలిసినప్పుడు కంగువ సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడమని సూర్య వెల్లడించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pushpa 2: పుష్ప2 పై హైప్ పెంచేసిన అనసూయ.. ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ అంటూ?

Published

on

Pushpa 2: పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న పుష్ప 2 సినిమా కోసం అంతే ఆత్రుత కనబరుస్తున్నారు.

Advertisement

ఈ సినిమా డిసెంబర్ ఆరో తేదీ విడుదలకు సిద్ధమైంది అయితే అనుకున్న సమయాని కంటే ముందుగానే ఒక రోజు విడుదల కాబోతుందని ఇటీవల నేషనల్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మేకర్స్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా తెలిపారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న అనసూయ కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.

ఈ వేదికపై నాగార్జున అనసూయని ప్రశ్నిస్తూ..పుష్ప సినిమాలో మంగళం శ్రీనును లేపేస్తాను అంటూ బెదిరిస్తున్నావు. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ తో దడిపిస్తున్నావు అంటూ కాసేపు నాగార్జున ఆట పట్టించారు. అనంతరం సినిమా గురించి అ నాగార్జున ప్రశ్నించడంతో మీరు నా వెనుకుంటానంటేనే సినిమా గురించి చెబుతానని అనసూయ చెబుతారు. దాంతో నాగర్జున నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని చెప్పారు.

కథ మొత్తం సీక్వెల్లోనే..
ఇక ఈ సినిమా ప్రతి సీన్ చాలా ఆసక్తిగా ఉంటుంది ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగే ఉంటుందని తర్వాత మరొక ట్విస్ట్ వస్తుందని తెలిపారు. పుష్ప వన్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే అసలు సినిమా మొత్తం ఇక్కడే ఉంది అంటూ ఈ సందర్భంగా అనసూయ పుష్ప సీక్వెల్స్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: నాగచైతన్య శోభిత విషయంలో వేణు స్వామికి షాక్ ఇచ్చిన కోర్టు?

Published

on

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ సంచలనం అయ్యారు. అయితే ఈయన సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జాతకం నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోయింది. ఇలా వేణు స్వామి జాతకాలు నిజం కావడంతో ఈయన తరచూ సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తల్లో నిలిచారు.

Advertisement

ఇక సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు వీరిద్దరిని నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వీరి నిచ్చితార్థం పై వేణు స్వామి సంచలన అయినటువంటి జ్యోతిష్యం చెప్పారు. సమంత నాగచైతన్య విడిపోయినట్టే శోభిత నాగచైతన్య కూడా విడిపోతారని ఈయన బాంబు పేల్చారు. ఇలా సెలబ్రిటీల గురించి పోయిన స్వామి చెప్పే ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఫిలిం జర్నలిస్టులు పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు.

ఈ క్రమంలోనే వేణు స్వామి పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో మహిళా కమిషన్ కూడా వేణు స్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే వేణు స్వామి మాత్రం మహిళా కమిషన్ కి ఆ అధికారం లేదని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

స్టే ఎత్తివేత..
తాజాగా నేడు ఆ స్టే ఎత్తివేస్తూ కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని హై కోర్ట్ తెలిపింది. అలాగే వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి వేణుస్వామి ఇప్పుడైనా మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?

Published

on

Jamili Elections: త్వరలోనే జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. 2027వ సంవత్సరంలోనే ఈ ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికలకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని తెలుస్తుంది. ఈ ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారని విషయం పై సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అంత సిద్ధంగా ఉండాలంటూ తన నేతలకు కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు జరగడానికి కారణం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సొంత కాళ్లపై కాకుండా ఊత కర్రపై నిలబడటమే అని చెప్పాలి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మోడీ సర్కార్ చంద్రబాబు నాయుడు సహాయం తీసుకుంది.

ఇలా చంద్రబాబుతో సహాయం పొందడంతో చంద్రబాబుకు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇలా ఎక్కువ కాలం పాటు ఊత కర్ర సాయంపై నిలబడలేనటువంటి కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదన తీసుకువచ్చింది. ఇక గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో జనసేన బిజెపికి మంచి మెజారిటీ లభించడంతో వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు భారీ స్థాయిలో సీట్ల కేటాయింపును కోరడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు..
ఇలా బిజెపి జనసేన కలిపి 75 స్థానాలు టీడీపీ 100 స్థానాలలో పోటీ చేసేలా చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇదే కనక జరిగితే ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా సీట్ల సమభాగాలుగా పంచుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు కొనసాగాలి. ఇలా జమిలి ఎన్నికలు వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికలు జరిగి తిరిగి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వస్తే చంద్రబాబు పవన్ సీఎంలు అయితే లోకేష్ పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!