Thammareddy Bhardwaja : రాజకీయ విమర్శలకు హద్దు ఉండాలి… వాలంటీర్లను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసారని ఎలా అంటావ్ పవన్…: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Thammareddy Bhardwaja : ఏపీ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా గురించి వారాహి యాత్రలో మాట్లాడటం వైరల్ అయింది. వాలంటీర్ల ద్వారా ఒంటరి మహిళలను, ఆడపిల్లలను టార్గెట్ చేసి మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ అక్షేపించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇప్పటికే 18 వేల మంది మహిళల ఆచూకీ తెలియరాలేదని, ఈ విషయం మీద రివ్యూ మీటింగ్ పెట్టాలని డిజిపి కి జగన్ కి అనిపించలేదా, మీడియాతో సహా అన్ని పార్టీలు ఈ ఇష్యూ మీద ఆలోచించాలి అంటూ మాట్లాడారు. అయితే ఈ విషయం అంతా వదిలేసి వాలంటీర్లు మహిళా అక్రమ రవాణా చేస్తున్నారని అంటే ఎలా అంటూ చాలా మంది మండిపడుతున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ విషయమా గురించి పవన్ మీద ఫైర్ అయ్యారు.

వాలంటీర్లను ఎలా అంటావ్…

ఆడపిల్ల విషయంలో రాజకీయ విమర్శల కన్నా అలోచించి మాట్లాడితే బాగుంటుంది. మహిళా ట్రాఫికింగ్ అంటూ పవన్ మాట్లాడారు. అంత ఎత్తున జరుగుతుంటే సిబిఐ వంటి కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నట్లు. ఈయన చెప్పిన వాటికి ఆధారాలు ఏమిటి అంటూ ప్రశ్నించారు.

వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారనే నింద మంచిది కాదు. ఇది చాలా సున్నితమైన విషయం, అలోచించి పవన్ విమర్శలను చేయాలి అంటూ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పవన్ తమ మీద చేసిన అనుచిత వాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.