Featured
తమ ఫ్యాన్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..!!
Published
4 years agoon
ప్రేమ ఒక మధుర భావన.. అది ఎవరి మధ్య, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో చెప్పలేని అద్భుతమైన స్పందన. ధనికా, పేదా భేధం లేకుండా కొందరి మధ్య ప్రేమ పుడుతుంటుంది.
ఈ ప్రేమకి సినీ ప్రముఖులు కూడా అతీతులు కారు.. కానీ,. అలాంటి అరుదైన ప్రేమకథలు.. తమ ఫ్యాన్స్ నే పెళ్లి చేసుకున్న నటీ, నటుల గురించి ఇప్పుడు మీరు చదివి తెలుసుకుంటే ప్రేమలోని గమ్మత్తేమిటో చెప్పగలుగుతారు. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు.. మేడిన్ మూవీ లాండ్ అని ఈతరం సినీ తారలను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. సామాన్య జనాలకు, వీళ్లకు తేడా ఏమిటంటే.. వాళ్లు చూపులు కలిసిన తర్వాత పెళ్లి పీఠలెక్కుతారు. కానీ వీళ్లు మాత్రం మనసులు కలిసాకా పెళ్ళి చేసుకుంటున్నారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటల జీవితానుభవాల పుటలను ఒక్కసారి తిరగేస్తే..
సూపర్‌స్టార్ రజనీ కాంత్, లతల ప్రేమకథ కొంత మందికి మాత్రమే తెలుసు.. 1980లో తలైవా ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న టైంలో లత ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధినిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిశారు. అప్పుడు రజనీ ‘గోల్‌మాల్’ కు రీమేక్‌గా తీస్తున్న ‘తిల్లు ముల్లు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సినీ జర్నలిస్ట్ లత.. రజనీని ఇంటర్వ్యూ చేయడానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. ఆ సందర్భంలో రజనీకాంత్ తన అభిరుచులు, అభిప్రాయాలను ఆమెతో పంచుకున్నారు. అనుకోకుండా ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు ఒక్కటయ్యాయి. ఇద్దరు ప్రేమలో పడ్డారు. జర్నలిస్ట్ లతను ఇష్టపడ్డ తర్వాత రజనీ ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారు సమ్మతించడంతో 26 ఫిబ్రవరి 1981న తిరుపతిలో ఇద్దరి పెళ్లి జరిగింది.
అలనాటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ డింపుల్ కపాడియా వయసు కేవలం 16 సంవత్సరాలున్న టైంలో ‘బాబీ’ చిత్రం విడుదల కాకముందు, డింపుల్ అప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను అనుకోకుండా కలవడం జరిగింది. ఆమె అందానికి మంత్రముగ్దుడైన రాజేష్ ఖన్నా ఒక రోజు డింపుల్ ను సముద్ర తీరానికి తీసుకెళ్లి అకస్మాత్తుగా డింపుల్ ముందు పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె రాజేష్ ఖన్నాతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉండడం చేత ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంది. కానీ రాజేష్ ఖన్నా డింపుల్ కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు అయినప్పటికీ అవేం పట్టిచుకోకుండా పెళ్లికి ఇద్దరూ సిద్దమైయ్యారు. ఇద్దరి పెళ్ళి ఆ సమయంలో సంచలనమైంది. పెళ్ళి తర్వాత, రాజేష్ ఖన్నా సినిమాలు చేయవద్దని డింపుల్ కి షరతులు విధించాడు, కాని డింపుల్ మాత్రం తన నటనని కొనసాగించాలనుకుంది. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలై డింపుల్ రాజేష్ ఖన్నాను విడిచి బయటికొచ్చేసింది. కొంత కాలానికి రాజేశ్ కన్నా సినిమాల నుండి రిటైరై పోయారు. డింపుల్ కు ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయే నేటి బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ కన్నా. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ భార్య.
బాలీవుడ్ స్టార్స్ హేమామాలిని, ధర్మేంద్రల కుమార్తె ఇషా డియోల్ పెళ్ళి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార వేత్త భరత్ తక్తానీని ఇషా పెళ్లాడింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వీళ్ళిద్దరి పెళ్ళికి ముందే ఈషా డియోల్ కి భరత్ పెద్ద ఫ్యాన్..
తమిళ స్టార్ హీరో విజయ్ ని ఒక సినిమా షూటింగ్లో కలిసింది సంగీత. విజయ్ అన్నా, అతని యాక్టింగ్ అన్నా పిచ్చి వ్యామోహం.. చచ్చేంత అభిమానం అని సంగీత విజయ్ ని కలిసిన సందర్భంగా ఉద్వేగంగా చెప్పడంతో, విజయ్ తన ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. అంతే.. ఆ పరిచయం కాస్త ఆ తర్వాత ఫోన్ కాల్స్, ఛాటింగ్స్ వరకు వెళ్లింది. తర్వాత ఇంకేముంది.. సంగీతని తన ఇంటికి ఇన్వైట్ చేసి, ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాడు విజయ్. పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు.
సఖి, యువ , అమృత ఇలా ఎన్నో చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుడు మాధవన్. తన భార్య సరితా బిజ్రేని మొట్ట మొదటిసారిగా కమ్యునికేషన్ స్కిల్స్ క్లాస్ లో కలుసుకున్నారు. నటుడు కాకముందు మాధవన్ కమ్యునికేషన్ స్కిల్స్క్ కు సంబంధించిన క్లాసెస్ ను చెప్పేవాడు. అక్కడ స్టూడెంట్ గా ఉన్న సరితా బిజ్రేకి మాధవన్ క్లాస్ అంటే ఒక ప్రత్యేక ఆసక్తిని కనపర్చేది. మాధవన్ టీచింగ్ స్కిల్స్ పట్ల ఎట్రాక్ట్ అయిన సరితా.. ఆ తర్వాత మాధవన్ తో ప్రేమలో పడింది. మాధవన్ కూడా సరితా ను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
You may like
Featured
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Published
11 mins agoon
21 November 2024By
lakshanaAnilKumar: ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు అరెస్టుల భయంతో వైకాపా పార్టీ నుంచి బయటకు వస్తూ టిడిపి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసారు. అయితే త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం వారి ఛానల్ సక్సెస్ కోసం నా గురించి ఎన్నో రకాల వార్తలు రాశారో ఆ వార్తలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఉపాధి కలుగుతుంది మీకు మంచి ఉద్యోగం వస్తుంది లేదా కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వార్తలు రాసేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నేను జనసేనలోకి వస్తున్నానని వార్తలు రాసిన నాకు జనసేన నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు. నేను ఏ పార్టీ మారనని.
ఇక తాను వైసీపీ పార్టీ కూడా కాదు. నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటాను. ఎప్పుడూ ఆయన వెంటే నేనని తెలిపారు. ఇక ఈ ఐదు నెలల కాలంలో నేను మీడియా ముందుకు రాకపోవడానికి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలే కారణమని తెలిపారు ఆ పనులలో ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోయాను ఇప్పటినుంచి పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతానని తెలిపారు.
AnilKumar: అరెస్టుకు భయపడేది లేదు..
ఇక కొంతమంది స్థానిక నేతలు నన్ను అరెస్టు చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా తనని అరెస్టు చేస్తే శునకానందం పొందాలని భావిస్తున్నారు. నన్ను ఒక్కరోజు కాదు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు జైల్లో పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లి వస్తున్నారు. నేనెంత అంటూ అనిల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Featured
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
Published
14 mins agoon
21 November 2024By
lakshanaNagashourya: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే విధంగా సినిమా కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాగశౌర్య సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
ఇదిలా ఉండగా నాగశౌర్య సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో 2022 నవంబర్ 20వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక వీరి వివాహం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య తన అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఈయన త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అనూష శెట్టి ప్రెగ్నెంట్ అని అయితే ఈ విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశారని తెలుస్తుంది.
Nagashourya: తండ్రి కాబోతున్నారా..
ఇలా సన్నిహితులకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పలేదని సమాచారం .అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగశౌర్య అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి నాగశౌర్య త్వరలోనే తండ్రి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Featured
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
Published
38 mins agoon
21 November 2024By
lakshanaYS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా సమాధానాలు చెప్పడమే కాకుండా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఎంతో మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు.
ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి బాటలో నడవాలి అంటే అనుభవం ఉన్న నాయకులు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇలా ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇలా అనుభవం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం అదృష్టం. మరో పదేళ్లు బాబుగారే సీఎం అంటూ పవన్ తెలిపారు.
ఇక ఈ విషయం గురించి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం వైయస్ జగన్ కి ఒక రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ బాబు గారే మరో 10 సంవత్సరాల పాటు సీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు దానిపై స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురవుగా జగన్ సమాధానం చెబుతూ…
YS Jagan: మంచి చేసిన వారే సీఎం..
ఒక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం ఎవరు అనేది వారు చేసిన మంచి పనుల బట్టే ఉంటుందని మంచి పనులు చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని జగన్ చెప్పారు. దీంతో కొంతమంది మీరు మంచి చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని కాదని చంద్రబాబుకు అధికారం ఇచ్చారా.. అంటూ కామెంట్లు చేయగా మరికొందరు జగన్ కి మద్దతు తెలియజేస్తున్నారు.
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
A.R Rahaman:రెహమాన్ విడాకులకు అసిస్టెంట్ తో ఎఫైర్ కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు?
Pawan Kalyan: మరో పదేళ్లు మా బాబు గారే సీఎం… చంద్రబాబుపై పవన్ కామెంట్స్ వైరల్!
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
Trending
- Featured4 weeks ago
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
- Featured3 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!