Connect with us

Featured

Pawan Kalyan -Varma: పవన్ కళ్యాణ్ తో విభేదాలు… సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ!

Published

on

Pawan Kalyan -Varma: పిఠాపురం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. కూటమి తరపున ఆ సీటు జనసేన ఎంచుకుంది. పవన్ అక్కడ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. వర్మను కాదంటూ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ కు సీట్ కేటాయించడంతో వర్మ పవన్ కళ్యాణ్ కు పూర్తి సపోర్ట్ ఇస్తూ ఆయనకు భారీ మెజార్టీ అందించారు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికులు వర్మ పట్ల దాడులకు కూడా పాల్పడిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో వర్మకు ఛాన్స్ లేకుండా జనసేన విస్తరణకు ఇదే తగిన సమయం అని భావించి వారు దూకుడు చేస్తున్నారు. మరో వైపు వర్మ మాజీ ఎమ్మెల్యేగా తనకు ఉన్న పరిచయాలతో నియోజకవర్గంలో తన హవా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో జనసేన వర్సెస్ వర్మ అన్నట్లుగా విభేదాలు బయటకు వచ్చాయని అంటున్నారు. అది కాస్తా ఇటీవల జరిగిన పిఠాపురం అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో బయటపడింది. దీంతో పిఠాపురంలో వర్మ హవా తగ్గిందని పవన్ కళ్యాణ్ తో తనకు విభేదాలు ఉన్నాయని వార్తలు రావడంతో వర్మ స్పందించారు.

ఎలాంటి విభేదాలు లేవు..
పవన్ తో కానీ జనసేనతో లోకల్ లీడర్స్ తో కానీ ఏ రకమైన విభేదాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో చిన్నపాటి గొడవలు అక్కడక్కడ క్యాడర్ మధ్య ఉండొచ్చేమో కానీ పై లెవెల్ లో అంతా బాగానే ఉంది అని ఆయన పక్కా క్లారిటీ ఇచ్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అద్భుతమైన పాలన కొనసాగుతుందంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Maanas: బ్రహ్మముడి నటుడు మానస్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Published

on

Maanas: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి ఒకరు. ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్లో రాజ్ పాత్రలో మానస్ నటన అద్భుతమని చెప్పాలి. అయితే తాజాగా మానస్ రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

Advertisement

మానస్ బాల నటుడిగా 2001లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. బీ గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇలా పలు సినిమాలలో బాల నటుడిగా నటించిన ఈయన అనంతరం బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్ ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న మానస్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత గుర్తింపు పొందిన ఈయన కార్తీకదీపం సీరియల్ నటించారు. ఇక ఈ సీరియల్ తర్వాత బ్రహ్మముడి సీరియల్ ద్వారా మరి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెరపై నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న మానస్ ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే తీసుకునే రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

రోజుకు 50 వేలు..
ఈయన నెలలో 20 లేదా22 పాటు షూటింగ్స్ లో పాల్గొంటారట. ఇలా ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే 50 వేల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇలా నెలకు సుమారు 11 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు. వీటితోపాటు ఈయన పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తుంటారు. దీన్నిబట్టి చూస్తుంటే మానస్ నెలకు 15 లక్షల వరకు సంపాదిస్తున్నారని చెప్పాలి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: సమంతతో నటించొద్దని వార్నింగ్.. సంచలన విషయాలు బయటపెట్టిన స్టార్ హీరో?

Published

on

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాలు వెబ్ సిరీస్ లలో బిజీ అవుతున్నారు. ఇక త్వరలోనే ఈమె నటించిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్ 7వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఇక ఈ సిరీస్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

Advertisement

ఇటీవల ఈ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో సమంతకు జోడిగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించారు. అయితే ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమంతకు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. తాను సమంతతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని విషయం తెలిసిన కొంతమంది బాలీవుడ్ బిగ్ విగ్స్ తనకు వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.

ఈ సిరీస్ సమంతతో కలిసి నటిస్తున్నాననే విషయం తెలియగానే సమంతతో నటించొద్దని, బాలీవుడ్ హీరోయిన్స్ తో తాను ఈ సిరీస్ లో నటించాలని తనకు వార్నింగ్ వచ్చినట్టు వరుణ్ దావని తెలిపారు. ఇలా ఈయన మాటలను బట్టి చూస్తుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత ఎదుగుదలను అడ్డుకోవాలని పలువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సమంత వద్దు..
ఈ విధంగా సమంతతో నటించద్దూ అంటూ కొంతమంది తనకు వార్నింగ్ ఇచ్చారని చెప్పిన వరుణ్ ధావన్ వాళ్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ నెపోటిజం ఉందని కొత్త వారికి అక్కడ అవకాశాలు ఉండవు అంటూ గతంలో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sekhar Basha: 3 గంటల పాటు పోలీస్ కస్టడీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష.. ఏమైందంటే?

Published

on

Sekhar Basha: ఆర్జేగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ బాషా ఇటీవల వరుస వివాదాలలో నిలుస్తున్నారు. ఈయన సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం పై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు అంతేకాకుండా ఒక న్యూస్ డిబేట్ లో పాల్గొన్నటువంటి ఈయన లావణ్య డ్రగ్స్ సరఫరా చేస్తుందని మాట్లాడటంతో ఆమె ఏకంగా లైవ్ లోనే చెప్పుతో దాడి చేసింది.

Advertisement

ఇలా శేఖర్ భాష రాజ్ తరుణ్ విషయంలో వార్తలలో నిలిచారు. అయితే ఈ వివాదం జరిగిన కొంతకాలానికి ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. రెండు వారాలు పాటు హౌస్ లో కొనసాగిన ఈయన తనకు కొడుకు పుట్టాడనే విషయం తెలియగానే తనంతటతానే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత మరోసారి వివాదంలో నిలిచారు.

ఇటీవల ప్రముఖ యూట్యూబ్ హర్ష సాయి ఒక నటి, నిర్మాత పట్ల లైంగిక ఆరోపణలకు పాల్పడ్డారని ఆమెను నగ్నంగా ఫోటోలు వీడియోలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ సదరు మహిళల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హర్ష సాయి విదేశాలలో దాక్కున్నారు. అయితే ఈ ఘటన గురించి శేఖర్ భాషా హర్ష సాయికి మద్దతు తెలుపుతూ యువతి పై ఆరోపణలు చేశారు.

వివరణ ఇవ్వాలి..
ఇలా తన గురించి చెడుగా మాట్లాడటంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం సాయంత్రం శేఖర్ భాషను అరెస్టు చేసి మూడు గంటల పాటు విచారణ చేశారు. బాధితురాలు పట్ల శేఖర్ భాషా చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇక ప్రస్తుతం హర్ష సాయి విదేశాలలో దాక్కున్నారని బాధితురాలి తరపు న్యాయవాది వెల్లడించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!