మేము బీర్లు ఎలా అమ్ముకోవాలి.. ముందు అనుమతి ఇవ్వండంటూ వారికీ డిమాండ్?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వివిధ వేరియంట్ల రూపంలో కోరలు చాపుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా గత ఏడాది జరగవలసిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అయితే ఒలంపిక్స్ జరుగుతాయా లేదా అన్న సందిగ్ధంలో నిర్వాహకుల నుంచి అథ్లెట్ల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న ఓ కంపెనీ మాత్రం ఒక విచిత్రమైన సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒలంపిక్స్ నిర్వహించకూడదని కొందరు డిమాండ్ చేయగా మరికొన్ని, ఒకవేళ ఒలంపిక్స్ నిర్వహించిన కూడా ప్రేక్షకులను మాత్రం అనుమతించ వద్దని పలు ఎన్జీవోలు జపాన్ ప్రభుత్వం, నిర్వాహక కమిటీని కోరుతున్నాయి. ఈ క్రమంలోనే టోక్యో ఒలంపిక్స్ స్పాన్సర్ లో ఒకరైన  ‘అషాహి బ్రూవరీస్’ (Asahi Breweries) సంస్థ మరో డిమాండ్ చేస్తోంది.

టోక్యో ఒలంపిక్స్ పూర్తి ప్రేక్షకులకు అనుమతి నిర్వహించాలి లేకపోతే పూర్తిగా వాయిదా వేయాలని తన అభిప్రాయాన్ని తెలిపింది. జపాన్ లో వివిధ రకాల బీర్ లను,వైన్, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ అమ్మే హక్కులు అన్నీ అషాహీ బ్రూవరీస్ వద్దనే ఉన్నాయి. ఈ క్రమంలోనే
అషాహీ ఒలంపిక్స్ కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి లక్షలాది మంది ప్రేక్షకులు అక్కడికి తరలిరావడంతో వారి బీర్ల అమ్మకాలు పుంజుకుంటాయన్న భావనతోనే ఒలింపిక్స్ కి స్పాన్సర్ చేసినట్లు తెలిపారు.

అషాహీ తమ పేర్లను స్టేడియంలో కూడా అందుబాటులో ఉంచడానికి అనుమతులను దక్కించుకుంది.ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఒలంపిక్స్ నిర్వహిస్తే తమ వ్యాపారం పూర్తిస్థాయిలో దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలంపిక్స్ నిర్వహిస్తే పూర్తిస్థాయి ప్రేక్షకులతో నిర్వహించాలి లేకపోతే ముందుగానే ఒలంపిక్స్ నుంచి స్పాన్సర్ గా తప్పుకుంటామని హెచ్చరిస్తోంది.