Uncategorized
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం యూజర్ గైడ్..అందరికి ఉపయోగం..షేర్ చేయండి..
Published
7 years agoon
By
telugudeskహైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం ఎల్అండ్టీ సంస్థ బుధవారం ‘యూజర్ గైడ్’ను విడుదల చేసింది.
పది కేజీల బ్యాగేజీ వరకే పరిమితం సులువుగా ప్రయాణించేలా సూచనలు.. సలహాలు.. గ్రేటర్ వాసుల కలల మెట్రో జర్నీకి ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎల్అండ్టీ సంస్థ బుధవారం నాడు ‘యూజర్ గైడ్’ను విడుదల చేసింది. మెట్రో లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ యూజర్గైడ్ను ఫాలో కావాలని ఆ సంస్థ సూచించింది. స్టేషన్లు, ఎస్కలేటర్లు, లిఫ్టుల వినియోగంపై పూర్తి వివరాలు స్పష్టంగా వివరించింది. స్టేషన్లోకి ఎంట్రీ నుంచి టికెట్ కొనుగోలు..రైలులోకి ప్రవేశించడం.. గమ్యస్థానంలో దిగడం వరకు చేయాల్సిన మరియు చేయకూడని పనుల్ని పేర్కొంది. ఈ గైడ్‌ను పరిశీలించడం ద్వారా నగరవాసులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మెట్రో జర్నీ చేయవచ్చని ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ శివానంద నింబార్గీ తెలిపారు. ఆ విశేషాలు చూడండి..
స్టేషన్‌కు ఎలా చేరుకోవడం :
► ప్రతి స్టేషన్‌కు రోడ్డు లెవల్లో ఎలివేటర్లు, లిప్టులు, మెట్లు, ఎస్కలేటర్లుంటాయి. ఇక మధ్యభాగం నుంచి ప్లాట్‌ఫాం పైకి చేరుకునేందుకు సైతం ఎలివేటర్లు, లిప్టులు, మెట్లు, ఎస్కలేటర్ల వంటి వసతులుంటాయి.
► శారీరక సామర్థ్యం సరిగా ఉన్నవారు మెట్ల మార్గాన్ని వినియోగిస్తే ఇతరులకు అసౌకర్యం ఉండదు.తద్వారా లిఫ్టులు, ఎస్కలేటర్ల వద్ద రద్దీ చాలా తగ్గుతుంది.
ఎస్కలేటర్ల ని ఎలా వినియోగించాలి :
► ఎస్కలేటర్ గమనానికి అనుగుణంగా మీ పాదాలను వాటిపై ఉంచి దానిపై నిల్చోవాలి.
► ఎస్కలేటర్‌పై కూర్చోవడం, నడవడం వంటివి చేయడం మంచిదికాదు.
► ఎస్కలేటర్‌పై ప్రయాణించేటప్పుడు రెయిలింగ్‌ను జాగ్రత్తగా పట్టుకొని భద్రంగా నిల్చోవాలి.
► చిన్నారులను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి.
► చీరలు, దుపట్టాలు ఎస్కలేటర్‌లో చిక్కుపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలి.
► గమ్యం చేరగానే ఎస్కలేటర్‌పై నుంచి జాగ్రత్తగా దిగి దూరంగా జరగాలి.
►ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎస్కలేటర్‌ను నిలిపివేసేందుకు కింద..మధ్య..పైన ఉన్న రెడ్బటన్ను నొక్కాలి
లిఫ్టులు ఎవరు ఉపయోగించాలి :
► దివ్యాంగులు, వృద్ధులు, అంధుల కోసమే లిప్టులను ఏర్పాటుచేశారని అస్సలు మరవద్దు.
► భారీ లగేజీతో వచ్చేవారు ..చిన్నారులను బేబీ కార్ట్‌లో తీసుకొచ్చేవారు, ట్రాలీ బ్యాగేజి ఉన్నవారు మాత్రమే లిఫ్టులను వినియోగించాలి.
స్టేషన్లో ఏమేమి ఉంటాయి :
► స్టేషన్ లోనికి, బయటికి ప్రవేశించేందుకు మధ్యభాగంలో నాలుగు వైపులా గేట్లుంటాయి. స్టేషన్‌ను పెయిడ్, అన్‌పెయిడ్ అని రెండు ఏరియాగా విభజిస్తారు.
► పెయిడ్ ఏరియా: ప్లాట్‌ఫాంను పెయిడ్ ఏరియాగా పిలుస్తారు. టిక్కెట్, టోకెన్, స్మార్ట్ కార్డున్నవారినే ఈ ప్రాంతానికి అనుమతిస్తారు.
► అన్‌పెయిడ్ ఏరియా: స్టేషన్ కిందిభాగం(రోడ్ లెవల్), మధ్యభాగం(కాన్కోర్స్)లెవల్. ఇక్కడ రిటెయిల్ దుకాణాలు, స్టోర్లుంటాయి. ఇక్కడికి టిక్కెట్ అవసరం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చు.
స్టేషన్లలో ప్రయాణికుడికి సూచనలు :
► ప్రతి స్టేషన్లో మీరు ప్రయాణించే మార్గానికి సంబంధించి నెట్వర్క్ మ్యాప్, స్టేషన్ లేఅవుట్, లోకల్ ఏరియా మ్యాప్, రైళ్ల టైమ్‌టేబుల్, రైళ్ల ఛార్జీల పట్టిక, చేయాల్సిన, చేయకూడని పనులకు సంబందించిన చార్టులుంటాయి.
► ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు..వారికి దిశానిర్దేశం చేసేందుకు సైనేజి బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేశారు.
► అంధులు నేరుగా స్టేషన్‌లోనికి చేరుకునేందుకు వారికి ప్రత్యేక టైల్స్‌తో మార్గం ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో వారి చేతికర్ర ఆధారంగా నేరుగా ప్లాట్‌పాం పైకి చేరుకోవచ్చు.
► స్టేషన్లు, ప్రయాణికులకు తెలిసేలా రైళ్ల రాకపోకలపై నిరంతరాయంగా స్టేషన్లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనౌన్స్మెంట్ ఉంటుంది.
► రైలులోపల అత్యవసర కాల్‌బటన్ ఉంటుంది. ఏదైనా ఆపత్కాలంలో ఈ బటన్ నొక్కడం ద్వారా ట్రైన్ ఆపరేటర్‌ను సంప్రదించవచ్చు.
టికెట్లు, టోకెన్, స్మార్ట్ కార్డ్ ఇలా కొనుగోలు చేయండి :
►మెట్రో రైళ్లలో అప్పుడప్పుడూ ప్రయాణించేవారికి ఉపయుక్తంగా ఉండేందుకు టోకెన్లు ఉంటాయి.
►స్టేషన్ మధ్యభాగం(కాన్కోర్స్)వద్ద టికెట్ ఆఫీస్ మెషిన్(టీఓఎం) వద్ద వీటిని కొనుగోలుచేయాలి.
►టిక్కెట్ విక్రయ యంత్రం వద్ద టిక్కెట్లు తీసుకోవాలి. టోకెన్ యంత్రం వెనకాలే టికెట్ విక్రయ యంత్రం కూడా ఉంటుంది.
►టిక్కెట్లు, టోకెన్ల గోల లేకుండా స్మార్ట్ కార్డ్‌తో జర్నీ చేసేందుకు స్మార్ట్ కార్డ్ నెబ్యులా మీకు ఉపయోగపడుతుంది.
►ప్రతి స్టేషన్ మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టికెట్ ఆఫీస్ మెషిన్ వద్ద వీటిని మీరు కొనుగోలు చేయవచ్చు.
►ఎల్అండ్టీ మెట్రోరైల్ వెబ్సైట్ ద్వారా కూడా వీటి కొనుగోలుకు ఆన్లైన్ చెల్లింపులకు డెబిట్, క్రెడిట్ కార్డులను కొనుగోలు చేయాలి.
స్టేషన్లో దిగిన తరవాత…
► స్టేషన్ బయటికి వెళ్లే చోట ఉన్న మ్యాప్‌ను పరిశీలించాలి. తద్వారా మీరు ఎక్కడికి ఎలా వెళ్లాలన్న విషయం
మీకు స్పష్టమౌతుంది.
► ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్లే సమయంలో మీ వద్దనున్న స్మార్ట్‌కార్డ్, టిక్కెట్ లేదా టోకెన్ వారికి చూపాల్సి ఉంటుంది.
► స్టేషన్ కిందిభాగం(రోడ్‌లెవల్)లో పాదచారుల మార్గాలు, ఫుట్పాత్లుంటాయి.
► ఇక్కడ సైకిల్లు అద్దెకు తీసుకునే సౌకర్యం ఉంటుంది.
► బస్సులు, షెటిల్ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపే అవకాశం ఉంటుంది.
వివరాలకు ఈ వీడియో చూడండి..
You may like
Uncategorized
అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా! : కొత్తపల్లి గీత
Published
8 months agoon
3 April 2024By
lakshanaకొత్తపల్లి గీత.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రభుత్వాధికారిగా.. రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమే.! తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-01 అధికారిగా సేవలందించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీచేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన మరుసటి రోజు నుంచే అరుకును అభివృద్ధి బాటలో నడిపించి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంటే ఏంటో చూపించారు.
నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని విబేధాలతో బయటికొచ్చి.. ఎంపీగానే కొనసాగుతూ 2018లో స్వయంగా జనజాగృతి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సామాజిక వర్గాన్నే కాదు.. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన వారిని అభివృద్ధి బాటలో నడిపించాలనే తపనతో ముందుకొచ్చారు కానీ.. పార్టీ అంటే డబ్బులతో ముడిపడి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకుని 2019లో బీజేపీలో విలీనం చేయడం జరిగింది. నాటి నుంచి బీజేపీ నేతగా కొనసాగుతూ నియోజకవర్గానికి తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఆమె కృషికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అంతేకాదు.. అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న గీతను సీటు దక్కేలా చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ కొత్తపల్లి దూసుకెళ్తున్నారు.
గిరిజనాభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని గీత గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. అరకులో ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా మార్చడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఎందుకంటే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని.. గిరిజనులు అంటే మోదీకి ప్రేమ అని.. దీంతో కచ్చితంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డను బాగుచేస్తామని.. అది కూటమి గెలిస్తే.. కేంద్రంలో మోదీ వస్తేనే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అరకు ఎంపీగా గెలిస్తే.. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను బాగు చేయడం ఈ నాలుగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు గీత. యువత అంటే ఎంతసేపూ జెండాలు పట్టుకోవడానికి తప్ప.. వారికి ఉద్యోగాలు, ఇండస్ట్రీలు తీసుకొచ్చిన పాపాన వైసీపీ పోలేదన్నారు.
ఇప్పటికే తాను ఎంపీగా పనిచేసినంతకాలం అభివృద్ధికై సాయశక్తులా కృషి చేశానని.. మరోసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపిస్తామంటున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్థులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని.. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు పనిచేయడానికే తాను ముందుంటానని చెబుతున్నారు. దీంతోపాటు ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా చేస్తామని మాటిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేయకుండా ఉండటానికి తనవంతుగా యుద్ధం చేస్తానని.. చట్ట ప్రకారమే చేయడానికి మాత్రమే వీలుకల్పిస్తామని కొత్తపల్లి క్లియర్ కట్‌గా చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న మనిషి. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి.. ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగానే కాకుండా.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. గిరిజనులను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా మోదీ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయో అరకులో కూడా అలాంటివే ఏర్పాటు చేసి.. విదేశీ విద్యకు గిరిజనులను పంపి.. ఇవేకాదు సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని గీత చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా.. అరకు ప్రాంతానికి వ్యాపారం పేరిట వచ్చి కొందరు అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడం.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి తన వంతు ప్రయాత్నాలు చేస్తానని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను దీన్ని రూపుమాపడానికి 2014లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని.. ఈసారి 2024 ఎంపీగా గెలిస్తే ఎన్నికల ఫలితాలొచ్చిన జూన్-05 నుంచే కచ్చితంగా దీన్ని అణిచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు గీత వెల్లడించారు.
Featured
Crime News : ఆరు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి… ఒంటిపై పంటిగాట్లు గుర్తించి !
Published
3 years agoon
26 January 2022By
lakshanaCrime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. కౌమార దశలో ఉండే పదమూడు సంవత్సరాల మైనర్ బాలిక శారీరంగా వచ్చే మార్పులు ఆమెను ఓ దారుణానికి వాడుకున్నాయి. తాను ఏం చేస్తున్నానో తెలియని చిన్న వయస్సు ఒకవేళ తెలిసినా.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చేసుకోని వయస్సులో ఉంది ఆ చిన్నారి. అయితే ఓ కామ పిశాచికి ఇవే అనుకూలంగా మారాయి.
ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి. రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.
జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు.
ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటే ?
ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Featured
Viral News : ఒక్క నిమిషంలో ఆ ఘనత సాధించి గిన్నీస్ బుక్ లో చోటు… ఆ కుర్రాడు ఎవరంటే ?
Published
3 years agoon
26 January 2022By
lakshanaViral News : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రికార్డ్ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. కానీ మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. 24 సంవత్సరాల తౌనోజామ్ నిరంజోయ్ సింగ్ అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్ అప్లు తీసి ఔరా అనిపించాడు.
గతంలో 2009 మే 25న యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన గ్రాహం మాలీ నిమిషంలో 105 పుష్ అప్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకోల్పితే…అతడి రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్ సింగ్. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60 సెకన్లలో 109 పుష్ అప్స్ చేసి తన పేరును గిన్నీస్ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్ సింగ్.
నిరంజోయ్ సింగ్‌కు పుష్ అప్స్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. మణిపాల్ లోని ఇంపాల్ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.
మణిపూర్ ఆణిముత్యం అంటూ ప్రశంసిస్తున్న ప్రముఖులు…
మణిపూర్‌కి చెందిన ఈ యువకుడు సాధించిన ఈ ఘనతను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్ చేశారు కిరణ్ రిజిజు. అలానే 24 సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్ మంత్రులు, జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు. నిమిషంలో 120 పుష్ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్. అతని ప్రయత్నం సఫలం కావాలని… మరో రికార్డు నెలకోల్పాలని అందరం కోరుకుందాం.
ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Posani: రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పోసాని.. జగనన్న క్షమించు అంటూ?
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured4 weeks ago
AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?
- Featured4 weeks ago
Chandra Babu Naidu: పొత్తు ఆలోచన ఎవరిది… జైలు గోడల మధ్య జరిగింది ఇదేనా?