Connect with us

Featured

ఏడు భాషలు మాట్లాడగల ఏకైక హీరో.. బడా హీరోలను మించిన క్రేజ్… అర్ధరాత్రి అరెస్ట్.. అసలు ఎం జరిగింది?!!

Published

on

హీరో సుమన్… ఇంత ముందు రోజుల్లో ఆయన డేట్స్ కోసం సినీ దర్శక నిర్మాతలు పడిగాపులు కావాలంటే నమ్ముతారా మీరు. అవును ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న బడా హీరోల వెంట ఎలా దర్శక నిర్మాతలు వేచి ఉంటారో అలాగే ఇదివరకు హీరో సుమన్ వెనుక కూడా అలాగే ఉండేవారంట. అందానికి అందం, అలాగే చేతినిండా సినిమాలు, లెక్కలేని సక్సెస్లు ఇలా మంచి ఫామ్ లో ఉన్న హీరో కి ఒక్కసారిగా తన జీవితం తలకిందులైంది. ఒకే ఒక్కరోజు రాత్రి తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఓ రోజు రాత్రి హీరో సుమన్ ఇంటికి రాత్రి పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత హీరో సుమన్ అలా ఇలా అంటూ ఆ కేసు నుండి సుమన్ బయటికి రావడానికి చాలా సమయమే పట్టింది. నిజానికి ఆయన బంగారు భవిష్యత్తు మొత్తం ఆ కేసులో మొత్తం కొట్టుకుపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూస్తే…

Advertisement

1985 మే 19వ తారీఖున శుక్రవారం రాత్రి ఆయన గాఢనిద్రలో ఉన్నారు. పగలంతా ఆయన బిఎల్వి ప్రసాద్ గారి చిత్రంలో షూటింగ్ చేసి ఇంటికి వచ్చి నిద్రపోతున్నారు. అయితే మే 20 తెల్లవారుజామున 1:30 గంట సమయంలో కుక్కలు పెద్దగా అరుస్తూ ఉండడంతో ఆయనకు మెలకువ వచ్చింది. అయితే ఆ సమయంలో వాచ్మెన్ వచ్చి ఇంటి బెల్ కొట్టగా హీరో సుమన్ వచ్చి తలుపు తీశారు. అయితే ఆయనకు సార్ మన ఇంటికి చాలా మంది పోలీసులు వచ్చారు, వారు మీతో మాట్లాడాలి అని చెప్పగా సరే అని, వారిని లోపలికి రమ్మని వాచ్మెన్ కి తెలియజేశాడు. ఆ అలజడికి ఇంట్లో ఉన్న తన తల్లి కూడా నిద్ర లేచింది. అయితే పోలీసులు వెంటనే సుమన్ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో బాంబు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటూ ఇల్లు మొత్తం సోదా చేయాలని తెలిపి వేతక సాగారు. అలా వెతికిన తర్వాత ఎలాంటి బాంబు దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆ తర్వాత సుమన్ తో పోలీసులు మీరు మా వెంట మీరు ప్లోస్ స్టేషన్ కు రావాలని మీ మీద కొన్ని కేసులు ఉన్నాయని తెలిపారు. ఇలా ‘ ఏం మాట్లాడుతున్నారు…? మీరు ‘ అని అనే వాదనకు దిగే లోపు సుమన్ తల్లి తన దగ్గరికి వచ్చి ‘ నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం. పోలీసులతో కో-ఆపరేటివ్ చేయడం మన కర్తవ్యం, నువ్వు వెళ్ళు ‘ అని తెలిపింది. దీంతో హీరో సుమన్ తల్లి మాటను గౌరవించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.

అయితే అక్కడ ముందుగా అరగంట సేపు విచారించి తర్వాత పంపిస్తామని పోలీసులు తెలపగా అలా రాత్రి గంటలు గడుస్తున్నా తనని ఎవరూ పట్టించుకోలేదు. అలా తెల్లవారిపోయింది. తెల్లవారాక సుమన్ అమ్మ, అలాగే సుమన్ మేనేజర్ సారధి ఆయన దగ్గరికి వచ్చారు. అయితే వాళ్లకు ఏమి చేయాలో అంతు చిక్కలేదు. ఆయన దగ్గర చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. అయితే.. ప్రెస్ వాళ్ళు ఏం జరిగిందన్న విషయం సుమన్ ని అడిగితే తన దగ్గర సమాధానం లేకపోయింది. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏదో రాసుకున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం 7 గంటలకు సుమన్ సైదాపేట కోర్టులో హాజరు పరచి తనపై అమ్మాయిల హింసించేవారని, బ్లూ ఫిలిమ్స్ తీశాడని అభియోగాలు మోపారు. అయితే కేసు విచారణలో భాగంగా బ్లూఫిలిమ్స్ ఎక్కడున్నాయని పోలీసులను ఆధారాలు ఆడగగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని వారు తెలియజేశారు. అయితే అభియోగాలు చేసినప్పటికీ ఆ నేరాలకు పాల్పడ్డారని చెబుతున్న సమయం అలాగే డేట్స్ కరెక్ట్ గా ఉన్నాయా అంటే అది లేకుండా పోయింది. వారు చెప్పిన సమయానికి సుమన్ బెంగళూరులో షూటింగ్లో ఉన్నారు. ఇలా ఎలాంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు యాంటీ గుండా యాక్ట్ తో ఫైల్ చేయడం వల్ల అతనికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకపోయింది. దీంతో సుమన్ ను అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో మద్రాసు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే మద్రాస్ సెంట్రల్ జైల్లో కరడుగట్టిన నేరస్థులు, సాధారణ ఖైదీలు ఉండే సెల్లులో కాకుండా అత్యంత ప్రమాదకరమైన అందుకు దేశద్రోహులు, టెర్రరిస్టులు, మానసిక వ్యాధులు ఉండే వారి మధ్య పడవేశారు. తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను కాలరాత్రి ఏమైనా ఉన్నాయంటే అదే మే 20 ,1985. ఇక ఆ తర్వాత రోజు పేపర్స్ లో, అలాగే మీడియా హెడ్ లైన్స్ లో ఏవో కథనాలు వచ్చాయి. ఇక మరుసటి రోజు విజిటింగ్ గంటలలో సుమన్ అమ్మ, తన మేనేజర్ సారధి ఆయనను చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు.

అయితే సుమన్ అమ్మ తనకి ధైర్యం చెప్పి ఆమెకు కనిపించిన ప్రతి లాయర్ ను ప్రతి ఆధారాన్ని వదలకుండా సుమన్ రిలీజ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. ఇక ఆ న్యాయపోరాటం చేస్తున్న సమయంలో హీరో సుమన్ జీవితం పూర్తిగా చీకటి సెల్ కు అంకితమైంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి అప్పటి రోజుల్లో కరుణానిధి గారు రాజకీయ ఖైదీగా సెంట్రల్ జైలుకు అక్కడికి వచ్చారు. అయితే ఆ సమయంలో హీరో సుమన్ కు సెల్ లో ఉన్న సంఘటనను చూసి కరుణానిధి గారు చలించిపోయారు. దీనితో ఆయన పోలీసులను అతనిపై ఉన్న ఆరోపణలు ఏంటి…? మీరు అతనికి ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి…? అంటూ అతను దోషి అని తేల్చకుండా డార్క్ రూమ్ లో ఎలా ఉంచుతారు అంటూ జైలు సూపరింటెండెంట్ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హీరో సుమన్ సాధారణ సెల్ కు మార్చకపోతే మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో… ఆనాడు హీరో సుమన్ చీకటి శిక్ష నుండి బయటికి వచ్చాడు. ఆ తర్వాత మిగతా జైలు జీవితకాలాన్ని పెద్ద కష్టంగా ఆయనకు అనిపించలేదు. అయితే కేవలం ఎఫ్ఐఆర్ మీద ఒక ఖైదీని అది ఫేమస్ అయిన వ్యక్తిని ఇలా ఉంచడం ఎంత చట్టవ్యతిరేక చెబుతుంటే తన మీద తనకే కోపం వచ్చింది. ఆ సమయంలో తనను ఫిలిం ఇండస్ట్రీ వారు ఎవరూ పట్టించుకోలేదని నాతో సినిమాలు తీసిన నిర్మాతలు మాత్రం అప్పుడప్పుడు వచ్చి తనతో మాట్లాడి వెళ్లేవారని తాను ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎంక్వయిరీ చేసుకొని మరి వెళ్లేవారని సమాచారం.

అయితే ఆ సమయంలో మాత్రం కేవలం ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే హీరో సుమన్ పట్ల గళమెత్తారు. కుముదం అనే తమిళ పత్రికలో ధైర్యంగా హీరోయిన్ సుహాసిని ‘ సుమన్ మాకు బాగా తెలుసు. అతను అలాంటివి చేసి ఉండరని.. అతడు చాలా రిచ్ అండ్ డిగ్నిఫైడ్. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అంటూ’ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ సుమలత కూడా అంతే ధైర్యం గా మాట్లాడింది. వాళ్ళిద్దరు నుండి తప్ప మరొకరి నుండి చిత్రసీమలో హీరో సుమన్ కు ఎలాంటి సపోర్ట్ లభించలేదు అప్పట్లో. ఇలా హీరోయిన్స్ ప్రెస్ స్టేట్మెంట్స్ అలాగే సుమన్ తల్లి చేస్తున్న నాయకుడు మంచి రిజల్ట్స్ ను ఇచ్చాయి. తన తల్లి భారత దేశ న్యాయ వ్యవస్థలో అత్యంత ప్రతిభావంతులైన గొప్ప న్యాయ వాదిగా పేరొందిన రాం జెట్మలాని, సోలీ సొరాబ్జీ లాంటి లాయర్స్ గైడెన్స్ తోతమిళనాడు రాష్ట్రంలోని నెంబర్ వన్ లాయర్ గా పేరొందిన రామస్వామి గారు ఆయన అసిస్టెంట్ కుమార్ గారి కృషి ఫలితంగా చివరకు హీరో సుమన్ కు బెయిల్ మంజూరైంది. అయితే నిజానికి భారతదేశంలో నాన్ బెయిలబుల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తి కి బెయిల్ రావడం అన్నది మొదటి సారి. అలాంటి రాజీలేని పోరాటం కారణంగానే హీరో సుమన్ కి అప్పట్లో బెయిల్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇలాంటి ఆరోపణలు లేకపోయినా చివరికి ఐదు నెలల పాటు జైలు పాలు అయ్యి నరకయాతన అనుభవించిన తర్వాత ఆయన ఎట్టకేలకు అక్టోబరు 1, 1985న సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయ్యారు. అయితే రిలీజ్ సమయంలో కొందరు నిర్మాతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు దగ్గరికి వచ్చారు. ఏదిఏమైనా ఈ ఐదు నెలల జీవిత కాలం తో హీరో సుమన్ నిజంగా తన జీవిత కాలపు యాక్టర్ కెరియర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల వైపు నడిచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. నిజానికి హీరో సుమన్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మావి భాషలను అవలీలగా మాట్లాడగలరు. అంతేకాదు హీరో సుమన్ టాలీవుడ్ లో ఉన్న హీరోలలో మొట్టమొదటి కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి. ఆయన కేవలం యాక్టర్ మాత్రమే కాకుండా సంగీత సాధనాలను కూడా వాయించేవారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!