Connect with us

Featured

Analyst Damu Balaji : అప్రూవర్ గా మారమని ఎర్ర గంగిరెడ్డి కి సలహా ఇచ్చింది ఎవరు… దస్తగిరిని ఎందుకు ఆర్జీవి గిల్లుతున్నాడు…: అనలిస్ట్ దాము బాలాజీ

Published

on

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉంది. మొదటి నుండి వివేకానంద రెడ్డిని నమ్ముకుని బతికిన ఎర్ర గంగిరెడ్డి ఆయన హత్య కేసులోనే జైలులో ఉన్నాడు. అయితే జైలులో కూడా వివేకానంద రెడ్డి వ్యతిరేక వర్గంతో ఉండాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నాడు. జైలులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎర్ర గంగి రెడ్డి మీద చేయి చేసుకున్నట్లు కథనాలు వినిపిస్తున్న నేపధ్యంలో అసలేం జరుగుతోంది వంటి ఆసక్తికర అంశాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

Advertisement

ఎర్ర గంగిరెడ్డి తో మూలాఖాత్ అయింది ఎవరంటే…

బెయిల్ రద్దయ్యాక జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఆయనతో పాటు అదే జైలులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి ఉంటున్నారు. తాజాగా దస్తగిరితో మూలాఖత్ అయిన ఎర్ర గంగిరెడ్డి కి దస్తగిరి అప్రూవర్ గా మారిపో అని సలహా ఇచ్చాడట. దీంతో భాస్కర్ రెడ్డి అప్రూవర్ గా మారి ఎవరిని ఇరికిస్తాడో అన్న భయంతో ఎర్ర గంగిరెడ్డి మీదకి గ్లాస్ విసిరినట్లు బయటికి లీక్ అయిందని బాలాజీ అభిప్రాయపడ్డారు.

దస్తగిరి చేత సిబిఐ ఇలా ఎర్ర గంగిరెడ్డిని అప్రూవర్ అవ్వమని చెప్పిస్తోందని అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక దస్తగిరిని ఇంటర్వ్యూ చేయడానికి ఆర్ఙివి ప్రయత్నిస్తుండగా దస్తగిరి మాత్రం అతను ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో, లేని పోనీ సమస్యలు ఎందుకు అన్నట్లుగా అర్జీవీ ఇంటర్వ్యూని తిరస్కరించినట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు. ఇక కేసులో ఎర్ర గంగిరెడ్డి అప్రూవర్ గా మారితే భారతి రెడ్డి దాకా కేసు వెళ్ళొచ్చనే అంచనాలు ఉందంటూ బాలాజీ విశ్లేషించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!

Published

on

Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన తన ప్రవచన ప్రసంగాలలో భాగంగా సినిమా సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఈయన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే తగ్గేదేలే అనే డైలాగ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

అల్లు అర్జున్ తగ్గేదిలే అంటూ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది ప్రస్తుతం ఎవరు చూసినా ఇదే మేనరిజని ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ పాత్రలో కనిపించడంతో గరికపాటి ఈ సినిమా గురించి మాట్లాడితే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

స్మగ్లింగ్ వాళ్లను హీరోల్లా చేశారని.. అన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గెదేలా అంటాడా.. కుర్రాళ్లు ఇటీవల తగ్గెదెలా అంటున్నారు.. ఈ డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఈ సినిమా చేసిన దర్శకుడు హీరోలను కడిగిపారేస్తానంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Garikapati: స్మగ్లర్..

సత్య హరిశ్చంద్రుడు.. శ్రీరాముడు లాంటి వారు మంచి పనులు చేస్తారు.. వారు అలాంటి వ్యాఖ్యలు చేసిన దానికి ఒక అందముంటుందన్నారు. తొక్కలో స్మగ్లర్ ఈ డైలాగ్ లు వాడటమేంటని ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడటంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. సినిమాని సినిమా లాగా చూస్తే ఇలాంటి ఆలోచనలు రావు అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

https://x.com/MiryalaManmohan/status/1859501799511843292?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1859501799511843292%7Ctwgr%5Edec7abe16778b35a90ac7ca13742371c883926ea%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fzeenewstelugu-epaper-dh9cfa441265e44dc6946fe7674729ec1c%2Fgarikapatinarasimharaotaggedelaantaavamiandarnikadigestapushpa2midarechhipoyinagarikapaatividiyoide-newsid-n640179497

Advertisement

Advertisement
Continue Reading

Featured

Posani: రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పోసాని.. జగనన్న క్షమించు అంటూ?

Published

on

Posani: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైకాపా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలోకి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొంతమంది మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నామని ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు.

Advertisement

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా పార్టీ కార్యకలాపాలలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈయనకి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను అప్పజెప్పారు. ఈ విధంగా ఈయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫాన్స్ ఏకంగా ఈయన ఇంటిపై కూడా దాడి చేశారు.

ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై కూడా కేసు నమోదు కావడంతో ఈయన స్పందించారు. తాను అనవసరంగా ఎవరిని తిట్టలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబం పై దాడి చేయడంతోనే నేను కూడా విమర్శలు చేశాను అంటూ ఈయన చెప్పారు.

Posani: సినిమాలలో కొనసాగుతా..

ఇక తాజాగా తాను ఈ రాజకీయాలలో కొనసాగలేనని అందుకే తాను ఏ పార్టీలకు మద్దతు తెలియజేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా కూడా కొనసాగాను. ఇకపై సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తానని లేకపోతే నేనే సినిమాలు చేస్తాను అంటూ కూడా ఈ సందర్భంగా పోసాని జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఈయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Advertisement
Continue Reading

Featured

AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?

Published

on

AnilKumar: ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు అరెస్టుల భయంతో వైకాపా పార్టీ నుంచి బయటకు వస్తూ టిడిపి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసారు. అయితే త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం వారి ఛానల్ సక్సెస్ కోసం నా గురించి ఎన్నో రకాల వార్తలు రాశారో ఆ వార్తలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఉపాధి కలుగుతుంది మీకు మంచి ఉద్యోగం వస్తుంది లేదా కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వార్తలు రాసేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నేను జనసేనలోకి వస్తున్నానని వార్తలు రాసిన నాకు జనసేన నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు. నేను ఏ పార్టీ మారనని.

ఇక తాను వైసీపీ పార్టీ కూడా కాదు. నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటాను. ఎప్పుడూ ఆయన వెంటే నేనని తెలిపారు. ఇక ఈ ఐదు నెలల కాలంలో నేను మీడియా ముందుకు రాకపోవడానికి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలే కారణమని తెలిపారు ఆ పనులలో ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోయాను ఇప్పటినుంచి పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతానని తెలిపారు.

Advertisement

AnilKumar: అరెస్టుకు భయపడేది లేదు..


ఇక కొంతమంది స్థానిక నేతలు నన్ను అరెస్టు చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా తనని అరెస్టు చేస్తే శునకానందం పొందాలని భావిస్తున్నారు. నన్ను ఒక్కరోజు కాదు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు జైల్లో పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లి వస్తున్నారు. నేనెంత అంటూ అనిల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!