Balakrishna -NTR: బాబాయ్ కి పోటీగా అబ్బాయ్… మరోసారి మొదలైన రచ్చ!

0
37

Balakrishna -NTR: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెట్టినటువంటి వారిలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ మొదటి నుంచి తనని కాస్త దూరం పెడుతున్నారని అర్థమవుతుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఏ వేడుక అయినా కూడా ఎన్టీఆర్ దూరం పెడుతూ రావడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇదివరకు పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు.

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిన విషయం మనకు తెలిసింది. అదే విధంగా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇలా యాంకర్ గా కూడా ఎన్టీఆర్ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక బాలకృష్ణ ఎన్ని రోజులు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈయన అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా హోస్టుగా తన టాలెంట్ ఏంటో బయట పెట్టారు.

Balakrishna -NTR: బాలయ్య రికార్డ్ బ్రేక్ చేస్తారా..


తాజా సమాచారం ప్రకారం మరోసారి బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఈసారి సినిమాల పరంగా కాదని యాంకర్లుగా అబ్బాయి బాబాయ్ ఇద్దరు పోటీ పడబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓటీటీలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమానికి అత్యధిక రేటింగ్ రావడం మనకు తెలిసిందే. మరి ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో బాలయ్య రికార్డులను బ్రేక్ చేస్తారా అంటూ వీరిద్దరి గురించి చర్చలు మొదలయ్యాయి.త్వరలోనే ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించబోయే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.