Avasarala Srinivas : విజయ్ సాయి జీవితం తన కంట్రోల్ లో లేకుండా పోయింది… చనిపోడానికి కారణం…: అవసరాల శ్రీనివాస్

Avasarala Srinivas : అష్టా చెమ్మ సినిమాతో ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన శ్రీనివాస్ అవసరాల ఆ సినిమా తరువాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో నాని తో పాటు నటించిన శ్రీనివాస్ అదే తరహా పాత్రలే మళ్ళీ వస్తున్నాయన్న కారణంగా వెంటనే సినిమాలను చేయకుండా కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆరంజ్, సరదాగా కాసేపు వంటి సినిమాలను చేసారు. ఇక సినిమాలో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ అలాగే రైటర్ గాను పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ మూడింటిలో ఏదో ఒక దాంట్లో ఫోకస్ చేసుంటే ఇప్పటికి స్టార్ డమ్ వచ్చుండేదేమో కానీ అలా కాకుండా నచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కమెడియన్ తన సహచర నటుడు విజయ్ సాయి ఆత్మహత్య గురించి మాట్లాడారు.

విజయ్ సాయి జీవితం కంట్రోల్ లో లేదు…

అమ్మాయిలు అబ్బాయిలు, ఒకరికి ఒకరు, వంటి సినిమాల్లో కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన విజయ్ సాయి కుటుంబానిది మహారాష్ట్ర అయినా ఒంగోలులో సెటిల్ అయ్యారు. కొడుకు చిన్నప్పటి నుండి డాన్స్ చాలా బాగా చేస్తూ ఉండటం చూసి తండ్రి సినిమా ఇండస్ట్రీకి పంపాలని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. అలా హైదరాబాద్ లో సెటిల్ అయిన విజయ్ సాయి గారు సినిమాల్లో కమెడియన్ గా సెటిల్ అయి గుర్తింపు అందుకున్నా 2017 లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే ఆంతకుముందు అవసరాల శ్రీనివాస్ గారితో వరప్రసాద్ పొట్టి వరప్రసాద్ సినిమాలో కలిసి నటించారు. అవసరాల శ్రీనివాస్ గారు విజయ్ సాయి గారితో ఉన్న అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కమెడియన్ విజయసాయి మరణం గురించి మాట్లాడుతూ వరప్రసాద్ పొట్టి వరప్రసాద్ లో కలిసి నటించినపుడు పరిచయం ఉందని, తాను చాలా సెల్ఫ్ కంట్రోల్ లాగా మాట్లాడేవాడు స్ట్రగ్గల్స్ ఫేస్ చేయగలను అన్నట్లు చెప్పేవాడు కానీ అలా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు. అతని మరణం తరువాత అర్థమైంది పైకి చెప్పేది వేరు కానీ లోపల వారి స్ట్రగల్ వేరు అని అంటూ విజయ సాయి గురించి అభిప్రాయపడ్డారు.