Rithu Chowdary: సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న జబర్దస్త్ రీతు చౌదరి… కొత్త ఇంటిని కొన్న జబర్దస్త్ నటి!

0
69

Rithu Chowdary: నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పలు వెబ్ సిరీస్ లలోను పలు సినిమాలలోనూ నటిస్తూ నటిగా ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇలా వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ అంటూ పెద్ద ఎత్తున సందడి చేసే రీతూ తాజాగా ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రీతు చౌదరి తాతగా కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.నా తల్లిదండ్రులు ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలని వారి కోరిక అని అయితే ఇప్పుడు వారి కోరికను తాను నెరవేర్చానని తెలియజేశారు.

అదేవిధంగా తన తల్లిదండ్రుల పెళ్లి రోజు కావడంతో తన తండ్రికి వేడుకలు అంటే ఎంతో ఇష్టం ఉండడం చేత తన తల్లి చేత ఈమె కట్ చేయించారు. అనంతరం తన కారులో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు అన్నింటిని కూడా పూర్తి చేశారు. ప్రయాణిస్తున్నటువంటి రీతు ఈ కారులోనే తన తండ్రి తుది శ్వాస విడిచారని ఈమె ఎమోషనల్ అయ్యారు.

Rithu Chowdary: అమ్మను జాగ్రత్తగా చూసుకో…

ఇప్పటికీ నా తండ్రి నా వెనుక సీట్లు కూర్చుని ఉన్నారన్న ఫీలింగ్ తనకు కలుగుతుందని, నేనెప్పుడూ అలాగే ఫీలవుతూ ఉంటానని మా నాన్న లేకపోయినా తన సొంత ఇంటి కలలు నెరవేర్చాను అంటూ ఈమె బావోద్వేగం అయ్యారు. ఈ విధంగా ఈమె చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా అమ్మను జాగ్రత్తగా చూసుకో అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.