అలెర్ట్: వచ్చే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే!

మే నెలలో బ్యాంకులో ఏదైనా అత్యవసరమైన పనులు ఉండే వాళ్లు వెంటనే చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు ఉండటం వల్ల అనుకున్న సమయానికి మన పనులు జరగకపోవచ్చు. కనుక ముందుగానే బ్యాంకు సెలవులు చూసుకొని బ్యాంకు పనులు చేసుకోవడం ఎంతో ముఖ్యం.

అదే విధంగా ప్రస్తుతం కరోనా కేసులు అధికం కావడంతో వచ్చే నెలలో కూడ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే
ఎస్‌ఎల్‌బీఎస్ బ్యాంకు పని వేళలను కుదించాలని రాష్ట్రాలను కోరింది.ఈ క్రమంలోనే బ్యాంకులో పని ఉండే కస్టమర్లు బ్యాంకు సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయో తెలుసుకోవడం ఎంతో ఉత్తమం.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రకారం.. మే నెలలో బ్యాంకులకు 5 రోజులు పని చేయవు. కానీ ఈ సెలవులు అన్ని రాష్ట్రాలలోనూ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే పరిమిత మవుతాయి కనుక ఆయా రాష్ట్రాలకు మాత్రమే సెలవలు ఉంటాయి.

మే 1న కార్మికుల దినోత్సవం కారణంగా బ్యాంకులకు సెలవు.మే 7న జుమత్ ఉల్ విదా కారణంగా బ్యాంకులకు సెలవు.మే 13 రంజాన్.మే 14 భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి.మే 26 బుద్ద పౌర్ణిమ.ఇకపోతే మే 8, మే 22న రెండు, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు.దీని ప్రకారం చూస్తే మన తెలుగు రాష్ట్రాలలో కేవలం రంజాన్ రోజు మాత్రమే బ్యాంకు సెలవు ఉంటుంది.