Bengaluru Padma : తనికెళ్ళ భరణి, కోట, బాబు మోహన్ లకు మేము హెల్ప్ అయ్యాం కానీ… వాళ్ళు మాకు హెల్ప్ కాలేదు… సూర్యకాంతం గారు షూటింగ్ ఎలా ఉంటారంటే…: నటి బెంగళూరు పద్మ

Bengaluru Padma : బుల్లితెర, వెండి తేర రెండింటిలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి బెంగళూరు పద్మ. సీరియల్స్ ద్వారా ఎక్కువగా కనిపించే పద్మ గారు సురేష్ ప్రొడక్షన్స్ అలాగే ఈటీవీ వారి ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా కనిపించి మెప్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఎక్కువ సినిమాలను చేసిన ఆమె, ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోయిన్ తల్లిగా నటించారు. ఇక ఆమె భర్త అరుణ్ అలాగే కూతురు గాయత్రీ కూడా పలు సినిమాల్లో నటించగా గాయత్రి హ్యాపీ డేస్ సినిమాలో అప్పుగా అందరికి సుపరిచితురాలే. ఇక పద్మ గారు తన నేపధ్యం అలాగే కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

వాళ్లందరికీ మేము హెల్ప్ చేసాం… కానీ….

నాటక రంగం నుండి పద్మ గారు వచ్చారు. ఆలా నాటకాలు వేసే సమయంలో కోటా శ్రీనివాస రావు గారు, బాబు మోహన్, తనికెళ్ళ భరణి వీరందరితో పరిచయం ఉందని చెప్పిన ఆమె వారందరు రిహర్సల్ కి మా ఇంటికి వచ్చి చేసేవారని వాళ్ళు ఆపైన సినిమా రంగంలో కూడా బాగా అవకాశాలు అందిపుచ్చుకున్నారని చెప్పారు. అయితే వాళ్ళు ఇంటికి వస్తే టీ ఫలహారం అన్ని అమర్చి ఎక్కడైనా తప్పులు దొరలిన మా అమ్మ సరిచేసేది. ఆలా వాళ్లకు మేము హెల్ప్ చేసాం.

అయితే వారితో మంచి అనుబంధం ఉన్న అవకాశాలు ఏనాడు అడగలేదు. వాళ్ళనుండి హెల్ప్ తీసుకోలేదు అంటూ పద్మ తెలిపారు. ఎందరో సీనియర్ నటులతో నటించిన అనుభవం ఉంది. నాకు సూర్యకాంతం గారంటే చాలా ఇష్టం నన్ను కొంతమంది జూనియర్ సూర్యకాంతం అని పిలిస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆమె తో కలిసి ఒక సినిమాలో నటించాను. ఆమె షూటింగ్ కి పెద్ద క్యారేజ్ తెచ్చేవారు. ఆమె తినేది కొంచం పంచేది ఎక్కువ. అందరిని పేరుపేరునా పిలిచి భోజనం పెట్టేది చాలా గొప్పమనసు ఉన్న మనిషి అంటూ చెప్పారు. ఇక ఆమె వేసిన హిడింభ పాత్ర తాను నాటకాలలో వేసానని ఆ పాత్రకు బంగారు నంది వచ్చిందంటూ చెప్పారు పద్మ.