సన్నీ ఫ్యాన్స్ దూకుడు.. 52 శాతంకిపైగా ఓటింగ్.. షణ్ముఖ్ టైటిల్ ఆశలు గల్లంతేనా..?

బిగ్ బాస్ 5 తెలుగు చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వాళ్లే ఫైనలిస్టులు అంటూ నాగార్జున అధికారికంగా ప్రకటించాడు కూడా. కాజల్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. అందులో మొదట అందరికంటే ముందుగానే శ్రీరామచంద్ర ఫైనల్ చేరుకున్నాడు.

తర్వాత రెండో ఫైనలిస్టుగా సన్నీ, మూడో ఫైనలిస్టుగా సిరి హన్మంతు, నాలుగో ఫైనలిస్టుగా షణ్ముఖ్.. ఇక చివరి ఫైనలిస్టుగా మానస్ చోటు సంపాదించుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన మొదటి వారం నుంచే షణ్ముఖ్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు చాలామంది. కచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అతడే అవుతాడు అని. ఎందుకంటే.. అతడి బయటక ఫ్యాన్స్ కూడా అలా ఉన్నారు.

తెలుగులో ఎక్కువగా యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి షణ్ముఖ్. ఇక అనుకున్నట్లుగానే అతడు నామినేషన్లో మొదటి మూడు వారాలు లేడు. నాలుగో వారం నుంచి నామినేషన్లోకి రావడం మొదలైంది. అప్పుడు అందరి కంటే ఎక్కువ ఓట్లతో ముందుకు సాగాడు. అలా రెండు మూడు సార్లు అన్ అఫిషియల్ ఓటింగ్ లో మొదటిస్థానంలో కొనసాగాడు. తర్వత హౌజ్ లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా అతడి గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. అనూహ్యంగా సన్నీ ముందు వరుసలోకి వచ్చాడు. ఏడో వారం నుంచి సన్నీనే టాప్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. సీజన్ మొదలైనపుడు సన్నీపై ఎవరికీ అంచనాలు లేవు.

అస్సలు సన్నీ అంటే ఎవరకీ పెద్దగా తెలియదు కూడా. రానురాను సన్నీ ఫాలోయింగ్ భయంకరంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెకండ్ సీజన్‌లో కౌశల్‌ను ఇంటి సభ్యులు ఎలాగైతే టార్గెట్ చేసి హీరోను చేసారో.. ఇప్పుడు సన్నీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయనకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. బయట కొన్ని యూట్యూబ్ ఛానల్లో పోల్స్ ప్రకారం చూస్తూంటే విపరీతంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. దాదాపు 52 శాతంకు పైగా ఓట్లు పడుతున్నాయి.

రెండో స్థానంలో షణ్ముఖ్ 30 నుంచి 40 శాతం మధ్యలో ఉంటున్నాడు. ఇక మూడో స్థానంలో శ్రీరామ చంద్ర కొనసాగుతుండగా.. మానస్ నాలుగు.. సిరి ఐదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తుంటే మాత్రం సన్నీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. షన్ను గెలవడం నల్లేరు మీద నడకే అని చెప్పాలి.