మధుమేహంతో బాధపడుతున్నవారు గుడ్డు తినవచ్చా… నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న సమస్యలు మధుమేహ సమస్య ఒకటి అని చెప్పవచ్చు.ఈ సమస్యతో బాధపడే వారు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తుంటారు. మధుమేహంతో బాధపడే వారు గుడ్డును తినాలా.. వద్దా అన్న సందిగ్ధంలో పడి ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడే వారు తప్పనిసరిగా గుడ్డును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయని,భావిస్తారు అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని గుడ్డు తినని వారి కన్నా తినేవారిలో గుండె కె సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలోనూ గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గయని అధ్యయనంలో నిరూపించబడ్డాయి.

ఈ పరిశోధనలో భాగంగా మధుమేహంతో బాధపడే వారికి గుడ్లను ఇవ్వడం ద్వారా వారిలో గుండెకు సంబంధించిన వ్యాధుల లక్షణాలు కనిపించడంలేదనీ, గుడ్డును తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రొటీన్లు విటమిన్లు అధిక ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తున్నాయని,గుడ్డు తింటే కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. గర్భవతులు గుడ్డు తింటే చాలా మంచిదని ఈ సందర్భంగా నిపుణులు సూచించారు.

గుడ్లలో శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మెదడు ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మన శరీరంలో అన్ని జీవక్రియలు సరైన రీతిలో పని చేయడానికి దోహదపడతాయి. అలాగే జుట్టు చర్మం ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.