Connect with us

Political News

సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమావేశం!

Published

on

ఏపీలో సమగ్ర భూ సర్వేపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2023 నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని, పరికరాలను సిద్ధం చేయాలని సూచించారు.

Advertisement

కాగా భూ సర్వేలో అత్యున్నత సాంకేతిక ను ఉపయోగించుకోవాలన్నారు సీఎం జగన్. ఈ సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి 4 వారాలకు ఒకసారి సమగ్ర సర్వేపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Featured

AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?

Published

on

AnilKumar: ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు అరెస్టుల భయంతో వైకాపా పార్టీ నుంచి బయటకు వస్తూ టిడిపి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసారు. అయితే త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం వారి ఛానల్ సక్సెస్ కోసం నా గురించి ఎన్నో రకాల వార్తలు రాశారో ఆ వార్తలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఉపాధి కలుగుతుంది మీకు మంచి ఉద్యోగం వస్తుంది లేదా కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వార్తలు రాసేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నేను జనసేనలోకి వస్తున్నానని వార్తలు రాసిన నాకు జనసేన నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు. నేను ఏ పార్టీ మారనని.

ఇక తాను వైసీపీ పార్టీ కూడా కాదు. నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటాను. ఎప్పుడూ ఆయన వెంటే నేనని తెలిపారు. ఇక ఈ ఐదు నెలల కాలంలో నేను మీడియా ముందుకు రాకపోవడానికి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలే కారణమని తెలిపారు ఆ పనులలో ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోయాను ఇప్పటినుంచి పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతానని తెలిపారు.

Advertisement

AnilKumar: అరెస్టుకు భయపడేది లేదు..


ఇక కొంతమంది స్థానిక నేతలు నన్ను అరెస్టు చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా తనని అరెస్టు చేస్తే శునకానందం పొందాలని భావిస్తున్నారు. నన్ను ఒక్కరోజు కాదు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు జైల్లో పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లి వస్తున్నారు. నేనెంత అంటూ అనిల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!

Published

on

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా సమాధానాలు చెప్పడమే కాకుండా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఎంతో మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు.

Advertisement

ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి బాటలో నడవాలి అంటే అనుభవం ఉన్న నాయకులు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇలా ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇలా అనుభవం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం అదృష్టం. మరో పదేళ్లు బాబుగారే సీఎం అంటూ పవన్ తెలిపారు.

ఇక ఈ విషయం గురించి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం వైయస్ జగన్ కి ఒక రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ బాబు గారే మరో 10 సంవత్సరాల పాటు సీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు దానిపై స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురవుగా జగన్ సమాధానం చెబుతూ…

YS Jagan: మంచి చేసిన వారే సీఎం..


ఒక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం ఎవరు అనేది వారు చేసిన మంచి పనుల బట్టే ఉంటుందని మంచి పనులు చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని జగన్ చెప్పారు. దీంతో కొంతమంది మీరు మంచి చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని కాదని చంద్రబాబుకు అధికారం ఇచ్చారా.. అంటూ కామెంట్లు చేయగా మరికొందరు జగన్ కి మద్దతు తెలియజేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: మరో పదేళ్లు మా బాబు గారే సీఎం… చంద్రబాబుపై పవన్ కామెంట్స్ వైరల్!

Published

on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో 150 రోజుల కూటమి పాలన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. ఈ సందర్భంగా కూటమి పాలన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ 150 రోజుల కాలంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.

Advertisement

ముఖ్యంగా పాఠశాలలలో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టడంతో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ చేతులు జోడించి మరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం అని తెలిపారు. ఇలాంటి అనుభవం కలిగిన వారు అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో చంద్రబాబు నాయుడు ఆఫీసులో కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు చేయించుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రజల ముందుకు వచ్చి నేనున్నాను ఎవరు భయపడొద్దు అంటూ ప్రజలకు భరోసా కల్పించి బురదలో కూడా ఈయన పర్యటనలు చేశారు.

Pawan Kalyan: అనుభవం ఉన్న నాయకుడు..


గత ప్రభుత్వ హయామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కూడా చేపట్టలేదని అందుకే రాష్ట్రానికి అనుభవం కలిగిన నాయకుడు ఎంతో అవసరమని పవన్ తెలిపారు. ఇలా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమాలను కనుక చూస్తే మరో 10 సంవత్సరాల పాటు మన బాబు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఇలా బాబు గురించి పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!