Lakshmi Devi: ఇలాంటి సంకేతాలు మీకు కనబడుతున్నాయా… మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే?

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదించిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంది అంటే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనుక మనకి ఎదురవుతూ ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే.

మన ఇంటి ఆవరణంలో కోకిల తరచూ కూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం అయితే ఉదయం సమయంలో ఆగ్నేయ మూలలో కోయిల కూస్తూ ఉంటే అది అశుభానికి సంకేతం కానీ సంధ్య సమయంలో ఆగ్నేయ దిశగా కోయిల కూస్తూ ఉంటే మంచిది. అలాగే మామిడి చెట్టుపై కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని అర్థం.

ఇకపోతే నల్ల చీమలు ఇంట్లో కనపడితే అది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది ముఖ్యంగా చీమలు బియ్యాన్ని కనుక తీసుకు వెళుతూ ఉన్నట్టయితే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం. ఇక బల్లి కూడా మనపై అనుకోకుండా పడితే అది కూడా అదృష్టమని కానీ కుడి వైపు బల్లి పడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.

నల్ల చీమలు సంపదకు సూచిక…

ఇంట్లో కనుక నల్ల చీమలకు బదులు ఎర్రటి చీమలు కనపడితే మనపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇక చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు అనుకోకుండా పాము కనబడుతూ ఉంటుంది ఇలా పాము కనబడటం వల్ల ఏదైనా దోషం ఉందా అని భావిస్తూ ఉంటారు కానీ పాము కనబడటం లక్ష్మీదేవి రాకకు సూచిక అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కనుక కనపడితే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.