Lambasingi Movie Review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

దర్శకుడు నవీన్ గాంధీ దర్శకత్వంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి భరత్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా లంబసింగి. ఈ సినిమా మార్చి 15న విడుదల అయింది. బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకుడు కృష్ణ కొరసాల ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. కాన్సెప్ట్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందంటే..

కధ : వీరబాబు( భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన తర్వాత లంబసింగిలో డ్యూటీ పడుతుంది. ఊర్లోకి వస్తూనే హరిత ( దివి ) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే అదే ఊరిలో మాజీ నక్సలైట్స్ కి పునరావసం కల్పిస్తుంది ప్రభుత్వం, అందులో హరిత తండ్రి కూడా ఒకరు. అలాంటి వాళ్లతో రోజూ సంతకాలు తీసుకునే డ్యూటీ పడుతుంది వీరబాబుకి. హరితతో ప్రేమలో పడటానికి ఇదే అదునుగా భావించిన వీరబాబు హరిత ఇంటికి రాకపోకలు సాగిస్తాడు.

ఒకరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడటం కోసం హరిత, వీరబాబు మరింత దగ్గరవుతారు. అదే క్రమంలో ఒకరోజు తన ప్రేమను గురించి దివికి చెప్తాడు కానీ ఆమె అంగీకరించదు. అయితే ఒకరోజు డ్యూటీలో ఉన్న వీరబాబు మీద దాడి చేసి నక్సలైట్లు ఆయుధాలు తీసుకువెళ్లి పోతారు. అదే సమయంలో అతనికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏమిటి? హరిత వీరబాబు ప్రేమని కాదనటానికి కారణాలు ఏమిటి అనేది సినిమా.

విశ్లేషణ : దర్శకుడు ఎంపిక చేసుకున్న పాయింట్ ని యధావిధిగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే మొదటి భాగం కొంచెం లాగ్ అనిపించినా తర్వాత కథ లో క్యూరియాసిటీ చోటు చేసుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేనిదిగా ఉంటుంది. స్క్రీన్ ప్లే డిజైన్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాకి ఆర్ ఆర్ దృవన్ సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. విజయవర్ధన్ కావూరి ఎడిటింగ్ కూడా సినిమాకి హైలైట్ అయింది.

నటీనటులు : దివి హరిత పాత్రలో ఒదిగిపోయిందని చెప్పాలి, అలాగే భరత్ కూడా వీరబాబు పాత్రలో న్యాచురల్ గా నటించాడు. వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ కూడా సినిమాలో ఒదిగిపోయి నటించారు అనటం కన్నా జీవించారు అనొచ్చు.

చివరిగా: ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వేరే ప్రపంచంలోకి వెళ్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా చూడదగ్గ చిత్రం ఈ సినిమా.

రేటింగ్: 3/5