Connect with us

Featured

ప్రేమ్ నగర్ చిత్రంలో అక్కినేని ‘లే లే లే నా రాజా…’ అనే ఐటమ్ సాంగ్ ను జ్యోతిలక్ష్మి తో ఎందుకు చేయనన్నారు..!!

Published

on

1970 దశకం నుండి మెల్లిగా ఐటమ్ సాంగ్ ల ప్రభంజనం మొదలైంది. ఆ పాటలకు ఆజ్యం పోసింది ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ్ నగర్ లోని “లే లే నా రాజా.. నువ్వు లేవనంటావా..” అనే పాటనే చెప్పాలి. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన సాంగ్.. ఇక అక్కినేని నాగేశ్వరరావు మిగతా చిత్రాలతో పోల్చితే ఆయన కెరీర్ లో ప్రేమ్ నగర్ చిత్రానికి ఉన్న స్థానం వేరుగా ఉంటుంది. అక్కినేనికి మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా రామానాయుడుకు విజయాన్ని అందించిన చిత్రమిది. ఒకవేళ ఈ సినిమా ఆడకపోతే నిర్మాతగా ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని నిర్ణయానికి వచ్చేసిన రామానాయుడును నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా తెలుగుతో సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమా తీసే ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ప్రేమనగర్.

Advertisement

ఈ సినిమాలో పాటలన్నీ హిట్స్. ఆత్రేయ సాహిత్యం, మహదేవన్ సంగీతం సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఆత్రేయ పాటలు అంటే మసాలాలు దట్టించడం బాగా ఉంటుంది. ఆ పాటల్లో ఐటమ్ సాంగ్ గనక ఉంటే చెప్పేదేముంది.. ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాట మసాలా ఘాటును వెదజల్లుతుంది. “లే లే లే..నా రాజా.. నువ్వు లేవనంటావా నన్ను లేపమంటావా”.. ఘంటసాల, LR.ఈశ్వరి పాడిన ఈ పాటని సినిమాలో అక్కినేని, జ్యోతిలక్ష్మి లపై చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఈ పాట విన్నవారంతా హవ్వ..! నాగేశ్వరావు సినిమాలో ఇలాంటి పాట.. అని విమర్శించారు. కానీ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత సర్దుకు పోయారు.

ఒకరోజు నాగేశ్వరరావు సెట్ లోకి వచ్చేసరికి వాణిశ్రీ సినిమా లోని ఐటమ్ సాంగ్ పాట వాడుతున్నారు. అది ఏ సినిమా లోనిది అని నాగేశ్వరరావు అడుగగా అప్పుడు మన ప్రేమ్ నగర్ సినిమా లోనిది.. మీరు, జ్యోతిలక్ష్మి కలిసి ఈ పాట పడాల్సి ఉంటుందని వాణిశ్రీ నాగేశ్వరావు చెప్పడంతో.. అప్పుడు నాగేశ్వరరావు నాన్సెన్స్.. ఆ పాట మన సినిమాలో అవసరం లేదని షాట్ రెడీ అయిందని వెళ్లిపోయారు. ఒక్కసారిగా నిర్మాత డి.రామానాయుడు గుండెల్లో బండ పడ్డట్టు అయింది.

తర్వాత రోజు వాణిశ్రీ సెట్ లోకి వచ్చేసరికి నాగేశ్వరరావు ఐటమ్ సాంగ్ కు ఒప్పుకున్నారని తెలిసింది. కారణం ఏంటని నాగేశ్వరరావును వాణిశ్రీ అడగగా.. సినిమాకు ఆ పాట చాలా కీలకమని చిత్రీకరించిన తర్వాత ఆ పాట మీకు నచ్చనట్లయితే దానిని సినిమా నుంచి తొలగిస్తామని దర్శకుడు ప్రకాష్ రావు చెప్పగానే ఒప్పుకొని ఆ పాట చేయడానికి సిద్ధపడ్డానని నాగేశ్వరరావు చెప్పారు. అలా ఆ‌ పాట చిత్రీకరణ జరిగి, ప్రేమ్ నగర్ సినిమా 1974లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఈ పాట వింటే, చచ్చినవాడు కూడా పైకి లేస్తాడు.. అంతటి ఘన విజయం సాధించింది ఈ పాట.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!