Connect with us

Featured

Renuka Swamy: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేణుక స్వామి భార్య.. ఆ బిడ్డకు దిక్కెవరంటూ!

Published

on

Renuka Swamy: కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య జరిగి దాదాపుగా నాలుగు నెలలు గడిచిన విషయం తెలిసిందే. నటుడు దర్శన్, అతని గ్యాంగ్ రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా హతమార్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. అందులో భాగంగానే నటుడు దర్శన్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రేణుకా స్వామి చనిపోయేనాటికి భార్య సహానా ఐదు నెలల గర్భంతో ఉంది. ఇప్పుడు ఆమెకు నెలలు ఉండిపోవడంతో తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement

చిత్రదుర్గ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సహానా డెలివరీ అయింది. దీంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అదే సమయంలో బిడ్డ పక్కన తండ్రి పక్కన లేకపోవడంతో సహానా కన్నీరుమున్నీరవుతోంది. దర్శన్ సన్నిహితురాలు పవిత్రకు రేణుకా స్వామి అసభ్యకర సందేశాలు పంపాడని అందుకే ఈ నటుడు అతనిని చంపాడని ఆరోపణలు ఉన్నాయి. రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి పట్టగెరె లోని ఒక షెడ్డులో దారుణంగా హత్య చేశారని దర్శన్ గ్యాంగ్ పై ఆరోపణలు ఉన్నాయి. రేణుకాస్వామి హత్య తో అతని కుటుంబం తల్లడిల్లి పోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు ఆయ్యారు.

బిడ్డకి దిక్కెవరు..

ఇక భార్య వేదన వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో విషాదంలో ఉన్న కుటుంబానికి ఇప్పుడు సంతోషకరమైన వార్త అందింది. రేణుకాస్వామి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డకు దిక్కెవరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రేణుకా స్వామి హత్య తర్వాత దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జూన్ 11న నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను గత నాలుగు నెలలుగా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అదే సమయంలో బెయిల్ కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే పలు సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కోర్టు ఈ పిటిషన్లను తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్‌ ఏ2, నటి, పవిత్రగౌడను ఏ1 గా నిర్ధారించారు పోలీసులు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!

Published

on

Aara Mastan: ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వచ్చాయి. కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ చివరికి బిజెపి హర్యానాలో విజయకేతనం ఎగరవేసింది. అయితే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆరా మస్తాన్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం కుదురుతుందని, అందుకే ఊహించిన ఫలితాలు రాకుండా వేరే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.తను వైసీపీ గెలుస్తుందని సర్వే చేసే తెలిపామని అది అబద్ధం అయ్యిందని దానికి కారణం ఈవీఎం టాంపరింగ్ అని అన్నారు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అదే ఈవీఎం కౌంటింగ్ సమయంలో బిజెపి ముందంజలోకి వచ్చింది.

దీన్ని బట్టి మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఇక్కడ గెలుస్తామనే నియోజకవర్గాలలో కాకుండా వేరే నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరా మస్తాన్ ఆరోపించారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్ .

Advertisement

ఒకప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు ఏ మాట్లాడాలని కానీ ఇప్పుడు మాత్రం ఆయన గప్‌చుప్ గా ఉన్నారని దీన్ని బట్టి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

AP Government: దీపావళికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం… రెండు పథకాలు అమలు!

Published

on

AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు.

Advertisement

ఇలా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పథకాలను అమలు చేయడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి అయితే ఈ దీపావళి పండుగకు మహిళలకు బంపర్ ఆఫర్ ఇస్తూ రెండు పథకాలను అమలులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అలాగే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా తెలియజేయడంతో మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మ ఒడి ప్రతినెలా ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 ఇస్తున్నట్లు కూడా ఎన్నికల హామీలలో చెప్పారు కానీ ఇప్పటివరకు వీటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఫ్రీ బస్ సౌకర్యం..
ఆగస్టు 15వ తేదీన ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పట్లో తెలిపారు. అయితే ఈసారి మాత్రం దీపావళికి ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు వెల్లడించారు కానీ ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు మాత్రం వెల్లడించకపోవడంతో పలువురు నిన్ను నమ్మం బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

MS Narayana: కమెడియన్ ఎమ్మెస్ నారాయణ సినిమాలలోకి రాకముందు అలాంటి పని చేసేవారా?

Published

on

MS Narayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఎంఎస్ నారాయణ ఒకరు. ఈయన తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 17 సంవత్సరాలలోనే సుమారు 700కు పైగా సినిమాలలో నటించి రికార్డు సాధించారు.

Advertisement

ఇలా తాగుబోతు క్యారెక్టర్ లోను అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అందరిని ఆకట్టుకునే విధంగా తన నటనతో మెప్పించిన ఎమ్మెస్ నారాయణ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెస్ నారాయణ తోబుట్టువులు పదిమంది అని తెలిపారు. ఏడుగురు అబ్బాయిలు కాగా ముగ్గురు అమ్మాయిలని ఈయన ఒక సందర్భంలో తెలిపారు. అయితే తన చిన్న చెల్లెలు పెళ్లి జరిగిన కొద్దీ రోజులకి మరణించారని ఆ విషయం తనని ఎంతగానో బాధపెట్టిన సంఘటన అంటూ తెలిపారు.

నేను సినిమాలలోకి రాకముందు ఒక స్కూల్ టీచర్ గా పని చేసే వాడిని అప్పట్లో చాలీచాలని జీతం వచ్చేది. తద్వారా కుటుంబ పోషణ ఎంతో భారంగా ఉండేదని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన చెల్లెళ్లకు కూడా పెద్దగా ఏమి పెట్టుకోలేకపోయానని తెలిపారు.

Advertisement

స్కూల్ టీచర్..
ఇలా తాను ఇండస్ట్రీలోకి రాకముందు స్కూల్లో టీచర్ గా పని చేసే వారని వెల్లడించారు. అయితే ఈయన చాలా సినిమాలలో కూడా లెక్చరర్ పాత్రలను ప్రిన్సిపల్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!