భారత్ లో ఎక్కువ శాతం డిజిటల్ చెల్లింపులే ఉన్నాయి. అందులో ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మరో విధానాన్ని నేడు (ఆగస్టు 2) సాయంత్రం ప్రదాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. దీనిలో ముఖ్యంగా ఒక క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి ఓ వోచర్ పంపిస్తారు. గూగుల్ పే, యూపీఐ, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల వలే ఇ-రూపీ ఒక పేమెంట్ ప్లాట్‌ఫారం కాదు.
ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వీటినే ఇ-రుపీగా భావిస్తారు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్ల లాంటివే. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి బ్యాంక్, డిజిటల్ యప్ లాంటివి సపోర్ట్ లేకుండా ఉంటుంది. ఈ ఓచర్లను జారీ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. వారికి మనకు వచ్చే డబ్బు ఎంతో తెలియజేసి.. ఫోన్ నంబర్ తో సహా వివరాలను చెప్పాల్సి ఉంటుంది.
Advertisement
అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వారు దానికి సంబంధించిన వోచర్ కోడ్ చెబితే రిడీమ్వ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మనకు పంపించి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరికి డబ్బులు చేరాలో వారి అకౌంట్లో పడిపోతాయి. ప్రస్తుతం అమెరికా విద్యావ్యవస్థలో ఈ- ఓచర్ల విధానం అమల్లో ఉంది. పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వవ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Posani: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైకాపా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలోకి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొంతమంది మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నామని ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు.
Advertisement
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా పార్టీ కార్యకలాపాలలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈయనకి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను అప్పజెప్పారు. ఈ విధంగా ఈయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫాన్స్ ఏకంగా ఈయన ఇంటిపై కూడా దాడి చేశారు.
ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై కూడా కేసు నమోదు కావడంతో ఈయన స్పందించారు. తాను అనవసరంగా ఎవరిని తిట్టలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబం పై దాడి చేయడంతోనే నేను కూడా విమర్శలు చేశాను అంటూ ఈయన చెప్పారు.
Posani: సినిమాలలో కొనసాగుతా..
ఇక తాజాగా తాను ఈ రాజకీయాలలో కొనసాగలేనని అందుకే తాను ఏ పార్టీలకు మద్దతు తెలియజేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా కూడా కొనసాగాను. ఇకపై సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తానని లేకపోతే నేనే సినిమాలు చేస్తాను అంటూ కూడా ఈ సందర్భంగా పోసాని జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఈయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
AnilKumar: ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు అరెస్టుల భయంతో వైకాపా పార్టీ నుంచి బయటకు వస్తూ టిడిపి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసారు. అయితే త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Advertisement
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం వారి ఛానల్ సక్సెస్ కోసం నా గురించి ఎన్నో రకాల వార్తలు రాశారో ఆ వార్తలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఉపాధి కలుగుతుంది మీకు మంచి ఉద్యోగం వస్తుంది లేదా కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వార్తలు రాసేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నేను జనసేనలోకి వస్తున్నానని వార్తలు రాసిన నాకు జనసేన నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు. నేను ఏ పార్టీ మారనని.
ఇక తాను వైసీపీ పార్టీ కూడా కాదు. నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటాను. ఎప్పుడూ ఆయన వెంటే నేనని తెలిపారు. ఇక ఈ ఐదు నెలల కాలంలో నేను మీడియా ముందుకు రాకపోవడానికి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలే కారణమని తెలిపారు ఆ పనులలో ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోయాను ఇప్పటినుంచి పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతానని తెలిపారు.
Advertisement
AnilKumar: అరెస్టుకు భయపడేది లేదు..
ఇక కొంతమంది స్థానిక నేతలు నన్ను అరెస్టు చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా తనని అరెస్టు చేస్తే శునకానందం పొందాలని భావిస్తున్నారు. నన్ను ఒక్కరోజు కాదు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు జైల్లో పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లి వస్తున్నారు. నేనెంత అంటూ అనిల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Nagashourya: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే విధంగా సినిమా కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాగశౌర్య సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
Advertisement
ఇదిలా ఉండగా నాగశౌర్య సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో 2022 నవంబర్ 20వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక వీరి వివాహం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య తన అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఈయన త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అనూష శెట్టి ప్రెగ్నెంట్ అని అయితే ఈ విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశారని తెలుస్తుంది.
Nagashourya: తండ్రి కాబోతున్నారా..
ఇలా సన్నిహితులకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పలేదని సమాచారం .అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగశౌర్య అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి నాగశౌర్య త్వరలోనే తండ్రి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.