Vijaykantha: ఇండస్ట్రీలో విషాదం కరోనాతో నటుడు విజయ్ కాంత్ మృతి?

Vijaykantha: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా డిఎండికే నాయకుడిగా రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ కాంత్ కొద్ది క్షణాల క్రితం కన్నుమూశారు. ఈయన ప్రముఖ నటుడిగా రాజకీయ నాయకుడిగా తనదైన శైలిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

అయితే గత కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయనను చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసే చికిత్స అందించారు. గతంలో ఈయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు అంటూ కూడా వార్తలను వైరల్ చేశారు కానీ ఆయన క్షేమంగానే ఉన్నారంటూ తన భార్య అతనితో కలిసి దిగిన ఫోటోలను విడుదల చేశారు.

అనారోగ్య సమస్యల నుంచి కాస్త కోలుకున్నటువంటి విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో ఈయనని చెన్నైలోనే మియాట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈయన పరిస్థితి మరింత విషమం కావడంతో వైద్యులు ఈయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చింది. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం చేత ఈయన శ్వాస తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు.

కరోనా పాజిటివ్…

శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వైద్యులు ఈయనని వెంటిలేటర్ పైకి తరలించి చికిత్స అందించారు. అయితే తన పరిస్థితి తీవ్రతరం కావడంతో కొన్ని క్షణాల క్రితం మరణించారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.