Featured
గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు ఎప్పుడంటే..?
Published
4 years agoon
By
lakshanaఏపీలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నెల రోజుల క్రితం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 16,208 ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలు జరిగాయి. పది లక్షలకు పైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయగా 7 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరున పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అధికారులు ఇప్పటికే ఆన్సర్ షీట్ల స్కానింగ్ అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఔస్ట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలలో 15 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొదట ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్నట్టు కొందరు పేర్కొనకపోవడంతో వాళ్ల వివరాలను సేకరించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
మరోవైపు ఈసారి గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు ఫలితాలతో పాటు ర్యాంకులను కూడా ప్రకటించనున్నారు. మొత్తం 14 రకాల రాత పరీక్షలు జరగగా ప్రతి ఒక్కరికీ ర్యాంకులను ప్రకటించునున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకులను అధికారులు ప్రకటించనున్నారు. గత నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయాల రాత పరీక్షలు జరిగాయి.
19 కేటగిరీలలోని ఉద్యోగాల కోసం ఏడు రోజుల పాటు పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో 1,10,520 పోస్టులు ఇప్పటికే భర్తీ కాగా 16,208 ఉద్యోగాలను ప్రభుత్వం భరీ చేయనుంది.
You may like
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
Ap Politics: అధికారం పోతుందన్న భయంతోనే వైసిపి గొడ్డలి ఎత్తుతున్నారు.. లోకేష్ కామెంట్స్ వైరల్!
Ramgopal Varma: పిఠాపురం ఎన్నికల బరిలో వర్మ… పవన్ కి పోటీగా నిలబడుతున్నారా?
Ap Politics: దేవినేని ఉమాకు షాక్.. పెనుమలూరులో టికెట్ కోసం అబ్బాయ్ బాబాయ్ పోటాపోటి!
Suriya: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య… ఏం చేశారో తెలుసా?
Featured
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Published
19 hours agoon
21 November 2024By
lakshanaAnilKumar: ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు అరెస్టుల భయంతో వైకాపా పార్టీ నుంచి బయటకు వస్తూ టిడిపి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసారు. అయితే త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం వారి ఛానల్ సక్సెస్ కోసం నా గురించి ఎన్నో రకాల వార్తలు రాశారో ఆ వార్తలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఉపాధి కలుగుతుంది మీకు మంచి ఉద్యోగం వస్తుంది లేదా కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వార్తలు రాసేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నేను జనసేనలోకి వస్తున్నానని వార్తలు రాసిన నాకు జనసేన నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు. నేను ఏ పార్టీ మారనని.
ఇక తాను వైసీపీ పార్టీ కూడా కాదు. నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటాను. ఎప్పుడూ ఆయన వెంటే నేనని తెలిపారు. ఇక ఈ ఐదు నెలల కాలంలో నేను మీడియా ముందుకు రాకపోవడానికి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలే కారణమని తెలిపారు ఆ పనులలో ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోయాను ఇప్పటినుంచి పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతానని తెలిపారు.
AnilKumar: అరెస్టుకు భయపడేది లేదు..
ఇక కొంతమంది స్థానిక నేతలు నన్ను అరెస్టు చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా తనని అరెస్టు చేస్తే శునకానందం పొందాలని భావిస్తున్నారు. నన్ను ఒక్కరోజు కాదు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు జైల్లో పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లి వస్తున్నారు. నేనెంత అంటూ అనిల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Featured
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
Published
19 hours agoon
21 November 2024By
lakshanaNagashourya: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే విధంగా సినిమా కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాగశౌర్య సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
ఇదిలా ఉండగా నాగశౌర్య సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో 2022 నవంబర్ 20వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక వీరి వివాహం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య తన అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఈయన త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అనూష శెట్టి ప్రెగ్నెంట్ అని అయితే ఈ విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశారని తెలుస్తుంది.
Nagashourya: తండ్రి కాబోతున్నారా..
ఇలా సన్నిహితులకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పలేదని సమాచారం .అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగశౌర్య అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి నాగశౌర్య త్వరలోనే తండ్రి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Featured
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
Published
19 hours agoon
21 November 2024By
lakshanaYS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా సమాధానాలు చెప్పడమే కాకుండా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఎంతో మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు.
ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి బాటలో నడవాలి అంటే అనుభవం ఉన్న నాయకులు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇలా ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇలా అనుభవం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం అదృష్టం. మరో పదేళ్లు బాబుగారే సీఎం అంటూ పవన్ తెలిపారు.
ఇక ఈ విషయం గురించి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం వైయస్ జగన్ కి ఒక రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ బాబు గారే మరో 10 సంవత్సరాల పాటు సీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు దానిపై స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురవుగా జగన్ సమాధానం చెబుతూ…
YS Jagan: మంచి చేసిన వారే సీఎం..
ఒక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం ఎవరు అనేది వారు చేసిన మంచి పనుల బట్టే ఉంటుందని మంచి పనులు చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని జగన్ చెప్పారు. దీంతో కొంతమంది మీరు మంచి చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని కాదని చంద్రబాబుకు అధికారం ఇచ్చారా.. అంటూ కామెంట్లు చేయగా మరికొందరు జగన్ కి మద్దతు తెలియజేస్తున్నారు.
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
A.R Rahaman:రెహమాన్ విడాకులకు అసిస్టెంట్ తో ఎఫైర్ కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు?
Pawan Kalyan: మరో పదేళ్లు మా బాబు గారే సీఎం… చంద్రబాబుపై పవన్ కామెంట్స్ వైరల్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured4 weeks ago
AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!