AP politics: ఈనెల 20న వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల.. కీలకంగా మారిన మేనిఫెస్టో?

AP politics: ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనటువంటి అనంతరం అన్ని పార్టీ నేతలు ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థులు కూడా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ అంటూ కొన్ని పథకాలను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదలైన తరుణంలో వైసిపి పార్టీ ఈసారి ఎన్నికలకు ఏ విధమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేయబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే ఈయన చెప్పిన విధంగానే కులమత భేదాలు లేకుండా దాదాపు 99% ఎన్నికల హామీలను పూర్తి చేశారు. అయితే తమ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినా కూడా ఈ పథకాలన్నీ అమలు అవుతాయని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

వీటితోపాటు వచ్చే ఎన్నికలలో సరికొత్త మేనిఫెస్టో కూడా రాబోతుందని ప్రకటించారు. మనం చేసేదే చెబుతామని చెబితే మాట తప్పము అంటూ ఇటీవల జగన్ తెలిపారు. అయితే ఈయన విడుదల చేయబోయే మేనిఫెస్టో కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే జగన్ ఈనెల 20వ తేదీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని సమాచారం.

సిద్ధమైన మేనిఫెస్టో..
ఇప్పటికే ఈ మేనిఫెస్టో సిద్ధమైందని అయితే అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయని తెలుస్తోంది. అవి పూర్తి కాగానే మార్చి 20వ తేదీ తన మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు అయితే ఈసారి ఎక్కువగా విద్య నిరుద్యోగం రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేశారని తెలుస్తోంది.