గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. రూ.50 క్యాష్ బ్యాక్..?

దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై అదనపు భారం పడుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్ వినియోగదారుల నుంచి తీసుకోవాల్సిన మొత్తం కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఫలితంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు నష్టపోతున్నారు.
అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ పాకెట్స్ వాలెట్ ద్వారా 50 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ తక్కువ మొత్తమే అయినా పెరిగిన రేట్ల దృష్ట్యా ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా జనవరి నెల 25వ తేదీలోపు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్ ను పొందాలనుకునే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు మొదట పాకెట్స్ వాలెట్ యాప్ ను మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. pmrjan2021 అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించడం ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చు. పాకెట్స్ వాలెట్ యాప్ లో పే బిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్లర్ అనే ఆప్షన్ ను ఎంచుకుని కన్సూమర్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న 10 రోజుల్లో క్యాష్ బ్యాక్ అమౌంట్ యాప్ వాలెట్ లో జమవుతుంది. తక్కువ రోజులే సమయం ఉండటంతో ఈ నెలలో గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్నవాళ్లు ఈ ఆఫర్ ను వినియోగించుకుని సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.