Dasari Vignan & Damu Balaji : అప్పట్లో తారకరత్న రెస్టారెంట్ ను కూల్చిన కెసిఆర్ ప్రభుత్వం…: దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Dasari Vignan & Damu Balaji : కుప్పం పాదయాత్రకు వెళ్లి గుండెపోటు రావడంతో నారాయణ హృదయాలయలో 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబాన్నే కాకుండా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు ప్రజలను బాధకు గురిచేసింది. ఇక ఆయన ఈమధ్యనే మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు, ఈసారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం సిద్ధపడుతున్న సమయంలో ఇలా అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఆయన తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకోవడం వల్ల తారకరత్న సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సెటిల్ అయ్యారు.

రెస్టారెంట్ కూల్చేసిన కెసిఆర్ ప్రభుత్వం…

తారకరత్న కు సంబంధించిన ఒక హోటల్ ను కెసిఆర్ ప్రభుత్వం 2019 లో కూల్చేసింది. బంజారాహిల్స్ లోని హోటల్ లో మద్యం కూడా సప్లై చేస్తున్నారని అక్కడ నివసిస్తున్న కొంత మంది మున్సిపల్ వాళ్లకు కంప్లైంట్ చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు కూల్చేశారు. ఈ విషయం గురించి దాసరి విజ్ఞాన్ అలాగే దాము బాలాజీ మాట్లాడుతూ నిజానికి ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా డైరెస్ట్ గా వెళ్లి కొంతభాగం కూల్చారు. ఇక విషయం తెలిసి తారకరత్న అధికారులతో మాట్లాడి హోటల్ ను షిఫ్ట్ చేసారు.

అయితే ఏమాత్రం నోటిసు ఇవ్వకుండా అది కూడా ఒక ప్రముఖ వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటి అనే విమర్శలు అప్పుడు కెసిఆర్ ప్రభుత్వం మీద వచ్చాయి. నిజానికి అక్కడే ఎప్పటినుండో ఉన్న మద్యం దుకాణం మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం తారకరత్న హోటల్ ను మాత్రమే కూల్చడం కక్ష్య పూరిత చర్యగానే భావించాలి అంటూ దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. కావాలనే ఎవరైనా తారకరత్న ను ఇబ్బంది పెట్టాలని అలా చేసారా అనే అనుమానాలు అప్పట్లో ఉండేవి అంటూ చెప్పారు.