Hero vishal: సీఎం జగన్ అంటే ఇష్టం…కుప్పం రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్!

Hero vishal: కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ తాజాగా లాఠీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా హీరో విశాల్ తిరుపతిలోని పలు కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు విశాల్ సమాధానాలు చెప్పారు. అయితే ఓ విద్యార్థి హీరో విశాల్ ను ప్రశ్నిస్తూ మీకు రాజకీయాలలో ఏ నాయకుడు అంటే ఇష్టం అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తనకు జగన్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. అదేవిధంగా కుప్పం రాజకీయ ఎంట్రీ గురించి కూడా విశాల్ మాట్లాడారు.
తనకు కుప్పంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని అయితే తాను రాజకీయాలలోకి మాత్రం రావడంలేదని స్పష్టత ఇచ్చారు.

Hero vishal: సేవ చేయాలంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదు…


ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదని ఈయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ తాను చాలా సంతోషంగా ఉన్నానని, రాజకీయాలలోకి వచ్చే ఆలోచన తనకు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా విశాల్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.