టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ భామ ఖాతాలు లెక్కకు మించిన ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయి. పూజా హెగ్డే కెరీర్ చూస్తే మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంది.ఈ క్రమంలోనే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బుట్ట బొమ్మ.

అంతేకాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ పారితోషికం కూడా అదే విధంగా పెంచుతూ పోతోంది. ప్రస్తుతం ఒక సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు లోనే కాకుండా ఇంకా ఇతర భాషలలో కూడా ఈమె నటిస్తూ తారాజువ్వల దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు పూజా హెగ్డే స్వయంగా తెలిపింది.
తన కలల సౌధం నిర్మించుకుంటున్నారు అంటూ కామెంట్ చేసిన పూజ హెగ్డే, ఇంటీరియర్ డిజైన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఫోటోలను పంచుకుంది. ఇక ఇంటికి సంబంధించిన కలర్స్, ఫర్నిచర్,డిజైన్ వంటివి తన టేస్ట్ కి తగ్గట్టు గానే దగ్గరుండి పూజ సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పూజ, అక్కడ కూడా హౌస్ ను కొనుగోలు చేసిందట.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలసి భాయిజాన్ అనే సినిమాను, రన్ వీర్ సింగ్ తో కలసి సర్కస్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది పూజ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ తో కలసి రాదేశ్యామ్, రామ్ చరణ్ తో కలసి ఆచార్య ఇలాంటి భారీ భార్య పిల్లలు హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మహేష్ అప్ కమింగ్ సినిమాలకు కూడా పూజా హెగ్డే ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.




























