100 Years Old Restaurants: కొన్ని రెస్టారెంట్లకు ఒక్కసారి వెళ్లితే మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో కొన్ని ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారు. అలా 100 సంవత్సరాల నుంచి అదే రెస్టారెంట్ ను నడుపుతూ.. ఎంతో మంది కస్టమర్లకు సర్వీస్ చేసిన రెస్టారెంట్లు ఇండియాలో బాగానే ఉన్నాయి. ఇన్ని రోజులు అవి ఇలా సర్వీస్ చేసుకుంటూ ఉన్నాయంటే.. ఆ రెస్టారెంట్లలో ఎలాంటి సర్వీసు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
ఇక.. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారత ఉపఖండం రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశం సుగంధ ద్రవ్యాలు.. విభిన్న సంస్కృతికి చెందిన దేశం. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం.. వైవిధ్యం కారణంగా దేశంలో విస్తృత శ్రేణి వంటకాలు ఉన్నాయి. ఇలా ఏదేశస్తులు అయినా ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పటికీ వదలరు. వాటిపై విసుగు అనేది రాదు. ఇక మంచి భోజనం ఎవరి మానసిక స్థితినైనా తేలికపరుస్తుందని ఎంతో మంది విదేశీయులు పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక 100 ఏళ్లు అంటే.. బ్రిటీష్ కాలంలో నిర్మించినవి అవేంటో చూద్దామా మరి..
గ్లెనరీస్, డార్జిలింగ్… డార్జిలింగ్ అంటే పర్యాటక ప్రదేశానికి పెట్టింది పేరు. అక్కడికి వచ్చిన పర్యాటకులకు గ్లెనరీస్ అనే రెస్టారెంట్.. ఎంతో అద్భుత అనుభవాన్ని కల్పిస్తుంది.గ్లెనరీ దాదాపు 130 సంవత్సరాల క్రితం నిర్మించారట. అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. దీనిలో రుచికరమైన అల్పాహారం నుంచి రుచికరమైన డెజర్ట్‌లు.. ప్రధాన ఆహార పదర్ధాలు ఉటాయి. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్‌ని సందర్శించినట్లయితే.. అక్కడ ఏదో పదర్థాన్ని రుచి చూడండి.
లియోపోల్డ్ కేఫ్, ముంబై ఇది ముంబైలో 150ఏళ్ల కాలం నాటిది. అప్పుడు ఇది ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉంది. 2008 ముంబై దాడుల సమయంలో ఈ కేఫ్ ప్రభావితమైంది. ఇప్పటికీ ఆ బుల్లెట్ గుర్తులు ఆ రెస్టారెంట్ వద్ద గుర్తులు ఉంటాయి. ఈ ప్రదేశం ఒక పర్యాటక ప్రదేశంగా గుర్తించబడుతోంది.
ఇండియన్ కాఫీ హౌస్, కోల్‌కతా.. ఇండియన్ కాఫీ హౌస్ లేదా ICH అని దీనిని పిలుస్తారు. ఇది ప్రతి భారతీయుడికి తెలిసిన ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్. మొదటి ఇండియన్ కాఫీ హౌస్ 1876లో కోల్‌కతాలో ప్రారంభించబడింది. అయితే దీనిని మొదట ఆల్బర్ట్ హాల్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 సంవత్సరంలో పేరు ఇండియన్ కాఫీ హౌస్‌గా మార్చబడింది. ఈ ప్రదేశం వద్ద లభించే కాఫీ స్వర్గాన్ని తలపిస్తుందని అంటుంటారు.
ఇది జామా మసీదు నుంచి కొద్ది దూరం నడిస్తే అక్కడ ఉంటుంది. దీనిని 1913లో నిర్మించారు. హాజీ కరీముద్దీన్ చేత స్థాపించబడింది. అతను ఆహారం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు. దీంతో ఢిల్లీలోని స్థానికులకు నవాబీ రాజ వంటకాలను తీసుకురావాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే విజయవంతంగా రూపొందించాడు. తర్వాత ఇది సెలబ్రిటీ చెఫ్ గా మారిపోయింది. ఇక్కడ అందించే ఆహారం.. 5 స్టార్ హోటల్ చెఫ్ అయినా అధిగమించలేరు.
Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాకేష్ ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన రాకేష్ తన తోటి కమెడియన్ జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల వీరిద్దరికీ ఓ చిన్నారి కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక సుజాత కూడా కెరియర్ పరంగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
Advertisement
రాకేష్ కేసీఆర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాకేష్ నటించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా అప్పట్లో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 22వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు రోజా కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే జబర్దస్త్ టీం అంతా కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేయడమే కాకుండా ఈ సినిమాకి మంచి విజయం అందించాలని కోరుకున్నారు. ఇక ఈ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని ఇల్లు కార్లు అన్నీ కూడా తాకట్టు పెట్టామని రాకేష్ తెలిపారు.
Rocking Rakesh: ప్రమోషన్స్..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన అర్ధరాత్రి హైదరాబాద్ వీధులలో తిరుగుతూ గోడలకు పోస్టర్లను ఆయనే అతికిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందులో సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో కొందరు ఇలా చిన్న చిన్న పనులను వాళ్లే చేసుకుంటూ సినిమా ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఈ సినిమాని సక్సెస్ చేయాలని కామెంట్లు చేయగా మరికొందరికి ఇది ఒక రకమైన ప్రమోషన్ అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మరి హీరోగా రాకేష్ నటించిన ఈ సినిమా ద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Keerthy Suresh: సినీ నటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీనియర్ నటి మేనక ప్రముఖ నిర్మాత సురేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
Advertisement
కేవలం సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక మహానటి సినిమా ద్వారా ఉత్తమ జాతీయ నటిగా పురస్కారాన్ని కూడా కీర్తి సురేష్ సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పై ఎంతో ఫోకస్ చేసిన ఈమె పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
ఇక గతంలో తన పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈమె స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. తాజాగా మరోసారి ఈమె పెళ్లి తేదీలతో సహా పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఇంకా కీర్తి సురేష్ స్పందించకపోవడంతో ఈ పెళ్లి వార్తలలో నిజం ఉందని అందరూ భావిస్తున్నారు. కీర్తి సురేష్ ఆంటోనీ తటిల్ అనే వ్యక్తితో గత 15 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం.
Keerthy Suresh: గోవాలో వివాహం..
ఈయన దుబాయిలో ప్రముఖ బిజినెస్ మెన్ గా గుర్తింపు పొందారు. ఇలా గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ వివాహానికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ నెల 11,12 తేదీన వీరి వివాహం గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నిర్మాతగా చేసిన కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఒక జబర్దస్త్ కమెడియన్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన రాకింగ్ రాకేష్ ఇలా సినిమాలలో హీరోగా నటిస్తూ ఆ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించటం విశేషం.
Advertisement
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు తన తోటి జబర్దస్త్ కమెడియన్స్ అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. అలాగే హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రోజా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత రోజా గారిని ఇలా ఈ వేదికపై కలవడం సంతోషంగా ఉందని తెలిపారు.. ఇకపోతే ఇటీవల రాజకీయాల పరంగా రోజా గారిని హైపర్ ఆది ఏమన్నారో తెలుసా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం ఎన్నో వార్తలను రాశారు.
Hyper Aadi: వ్యూస్ కోసమే..
ఈరోజు నేను ఇక్కడ చెబుతున్న నేను ఇంతవరకు రోజా గారిని ఎప్పుడు ఎక్కడ కూడా చెడుగా మాట్లాడలేదని, తన గురించి అలా ఎప్పటికీ మాట్లాడనని హైపర్ ఆది తెలిపారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా బాగుందని వెల్లడించారు. పుష్ప సినిమా త్వరలోనే రాబోతోంది ఇక ఆస్కార్ అవార్డు రావడం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల సినిమాలలో నటించడం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా 100% నటించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంది అంటూ హైపర్ ఆది ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.