Featured
బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిర్మలమ్మ.. అలాంటి గొప్ప నటీమణి మళ్ళీ ఇండస్ట్రీకి దొరకడం కష్టమే..
Published
3 years agoon
సినిమా ఇండస్ట్రీలో కళామతల్లి ఆశీస్సులు దక్కడం అంటే ఎంతో అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి రావాలని మంచి నటీ నటులుగా నిలబడాలని తాపత్రయపడేవారు ఎంతోమంది. కానీ, అందరికి ఆ అవకాశం రాదు. వచ్చినా ఇంతపెద్ద భారీ పోటీలో నిలబడి నెగ్గడం చాలా కష్ఠం. అప్పటివారు అనుకుంటారు.. ఈ తరం నటీ నటులకు చాలా సులభంగా అవకాశాలు వస్తున్నాయని. ఇప్పటివారు అనుకుంటున్నారు అప్పట్లోనే సినిమాలలో అవకాశాలు చాలా సులభంగా దక్కించుకున్నారని. కానీ ఎప్పుడు ఉండే పోటీ..కష్ఠం అప్పుడున్నాయి.
బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మలమ్మ. అప్పట్లో ఆమెకున్న అందానికి హీరోయిన్‌గా చేయడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. కానీ, కళామతల్లి ఒక్కొక్కరిని ఒక్కోలా వరిస్తుంది. అలా నిర్మలమ్మను అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యేలా చేసింది. 800 వందల సినిమాలలో గొప్ప పాత్రలు చేసిన నిర్మలమ్మ సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా తన నటనతో సహజత్వాన్ని తీసుకువచ్చిన నటి. అప్పట్లో సినిమా ఏదైనా నిర్మలమ్మకు ఓ పాత్ర ఉండాల్సిందే.
నిర్మలమ్మ అంటే అందరికీ బాగా గుర్తొచ్చే పాత్రలు బామ్మ పాత్రలే. ఎన్ని సినిమాలలో నిర్మలమ్మ బామ్మ పాత్ర చేసినా దానికి బాగా పేరొచ్చింది. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, మాయలోడు, స్నేహం కోసం లాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి – నిర్మలమ్మ మధ్య వచ్చే సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక స్నేహం కోసం సినిమాలో చిరంజీవికి తల్లిగా, బామ్మగా అద్భుతంగా నటించారు. ఇందులో సెంటిమెంట్ పాత్రతో పాటు, మంచి కామెడీ రోల్ చేసి నవ్వించారు.. ఏడిపించారు. కొడుకు జైలు నుంచి వచ్చిన సందర్భంలో ఆమె పలికించిన హావా భావాలు అందరి మనసులో అలా నిలిచిపోయాయి.
చినరాయుడు సినిమాలో వెంకటేశ్ తల్లిగా నటించిన నిర్మలమ్మ ఎమోషనల్ సీన్స్‌లోనూ, అలాగే విజయశాంతితో కలిసి కనిపించిన కామెడీ సీన్స్‌లోనూ ఎంతగా ఆకట్టుకున్నారో తెలిసిందే. ఎగిరేపావురమా సినిమాలో జేడి చక్రవర్తి – లయ కి బామ్మగా నటించిన నిర్మలమ్మ ఇందులో చెవుడున్న పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. ఆపద్భాంధవుడు, మాయలోడు, పండుగ, కిల్లర్, బావ బావమరిది, పేకాట పాపారావు, ఆలీబాబా అరడజను దొంగలు, శుభ సంకల్పం, మావి చిగురు, ఆహ్వానం, రాయుడు సీతారామరాజు, ప్రేమకు స్వాగతం..ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన పాత్రల్లో కనిపించి తనదైన శైలి నటనతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు.
ఇప్పుడున్న నటీమణుల్లో నిర్మలమ్మ లాంటి గొప్ప నటిమణి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు అని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఆవిడ పోషించనటువంటి పాత్రలు మరెవరూ చేయలేదు. అందులోనూ సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే నిర్మలమ్మ అనే నటీమణిని మరొకరు రీప్లేస్ చేయలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. నాటి నుంచి ఆమె చివరి సినిమా వరకు సెట్‌లో ఉన్న సహ నటీ నటులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ దగ్గర్నుంచి ఈ తరం హీరోలవరకు అందరితోనూ మంచి అనుబంధం ఉంది. అందుకే ఆమెను అందరూ నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.
You may like
Featured
Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
Published
4 hours agoon
22 November 2024By
lakshanaKeerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వినిపించాయి.
ఈ విధంగా కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలను ఖండించారు. ఒకానొక సమయంలో కీర్తి సురేష్ తండ్రి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఒకవేళ అలా తన పెళ్లి చేసుకుంటే కనుక ముందుగా ఈ విషయాన్ని నేనే మీకు తెలియజేస్తానని తెలిపారు.
అప్పటినుంచి ఈ వార్తలకు కాస్త పులి స్టాప్ పడినా, గత మూడు రోజులుగా ఈ పెళ్లి గురించి మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ కీర్తి సురేష్ వివాహం తనకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆంటోని తట్టిల్ తో డిసెంబర్ నెల 11వ తేదీ గోవాలోని ఒక రిసార్ట్ లో జరగబోతుందని తెలిపారు.
Keerthy Suresh:
ఈ విధంగా ఈయన తన కుమార్తె పెళ్లి గురించి అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కీర్తి ఆంటోని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆంటోనీ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Featured
YS sharmila: ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.. వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు?
Published
5 hours agoon
22 November 2024By
lakshanaYS sharmila: వైయస్ షర్మిల తనకు ప్రభాస్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఏ ప్రభుత్వంలో మహిళలు గురించి తప్పుగా మాట్లాడారనే విషయం గురించి ప్రస్తావనకు రావడంతో వైఎస్ షర్మిల గురించి గతంలో బాలకృష్ణ తన ఇంట్లో చేసిన ఆరోపణల గురించి మాట్లాడారు.
ఈ క్రమంలోనే వైయస్ షర్మిల ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ గారు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అంటూ మండిపడ్డారు.
YS sharmila: ఒక్కసారి కూడా చూడలేదు..
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట చెబుతున్న ప్రభాస్ అనే వ్యక్తి ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.ఆయనని నేరుగా నేను ఒక్కసారి కూడా చూడలేదు అంటూ షర్మిల ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఈమె ఇదే విషయం గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడిన ఒక వీడియోని కూడా వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎవరు ఎవరిని కించపరిచారో ఒక్కసారి చూడు షర్మిల అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Featured
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
Published
5 hours agoon
22 November 2024By
lakshanaRoja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ వైకాపా నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్లనులెక్క పెట్టాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే వివి ప్యాట్లను లెక్క పెట్టాలని చెప్పినప్పటికీ అప్పటికే వివి ప్యాట్లను నాశనం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సంచలన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికలు జరిగినా 6 నెలల వరకు ఈ వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా భద్రపరచాలి కానీ ఎన్నికలు జరిగినా నెలలోపు ఈ వివి ప్యాట్లను నాశనం చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కుట్ర జరిగిందోనని ఈమె తెలిపారు.
Roja: ఈవీఎం మాయ..
ఇకపోతే ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాలు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో కూడా అదే ఓట్లు తేలాల్సి ఉంటుంది కానీ ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఈవీఎం ప్రభుత్వమని అర్థమవుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
YS sharmila: ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.. వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు?
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- devotional2 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured4 weeks ago
Chandra Babu Naidu: పొత్తు ఆలోచన ఎవరిది… జైలు గోడల మధ్య జరిగింది ఇదేనా?