సినీ పరిశ్రమలో సినిమా పేరు చెప్పగానే.. దాని దర్శకుడు ఎవరో దాదాపుగా చెప్పేయవచ్చు. పౌరాణిక చిత్రాలంటే కమలాకర కామేశ్వరరావు, జానపద చిత్రాలంటే విటలాచార్య, యాక్షన్ చిత్రాలంటే కే.ఎస్.ఆర్.దాస్, కళాత్మక చిత్రాలంటే కె.విశ్వనాథ్. ఇలా ఒక్కో దర్శకుడికి ఒక్కో రకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వాతిముత్యం, స్వాతి కిరణం ఈ సినిమా పేర్లు చెప్పగానే ఎవరైనా టక్కున చెప్పేపేరు కె.విశ్వనాథ్.
Advertisement
ఆయన తీసిన కళాత్మక చిత్రాలు ఖండాంతరాలకు వ్యాపించి అనేకమంది ప్రేక్షకాభిమానులను ఆయన సంపాదించుకోగలిగారు. ఆయనా తీసే చిత్రాలకు అవార్డులు దాసోహం అన్నాయి. తెలుగు సాహిత్యాన్ని, సంగీతాన్ని మేళవించి తీసిన చిత్రాలు అజ్ఞానమనే అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేల్కొలిపాయి.
1976 గీతాకృష్ణ కంబైన్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “సిరిసిరిమువ్వ” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో చంద్రమోహన్, జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. నాట్యాన్ని ప్రధానంశంగా చేసుకొని వచ్చిన ఈ సినిమా కళాతపస్వి రూపొందించిన చాలా చిత్రాలకు మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు.
1980, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “శంకరాభరణం” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. శంకరాభరణం శంకరశాస్త్రి గానాన్ని ప్రాణంగా భావించి, తన జీవితాన్ని కొనసాగించే పాత్రలో సోమయాజులు సినిమా మొత్తం తానే నటించారనేకంటే నడిపించారనడం సమంజసం. ఇలా సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం లాంటి అనేక చిత్రాలు కళలను ఆధారంగా చేసుకుని కె. విశ్వనాథ్ మనసుపెట్టి రూపొందించారు.
కానీ ఈ చిత్రాల కంటే ముందు 1978లో శోభన్ బాబు, కైకాల సత్యనారాయణలను ప్రధాన పాత్రలో “కాలాంతకులు” అనే చిత్రాన్ని కె.విశ్వనాధ్ నిర్మించారు. “కాలాంతకులు” చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్ అంటే దాదాపుగా ప్రేక్షకులు ఎవరూ నమ్మరు.
ఒక విధంగా చెప్పాలి అంటే కె.విశ్వనాథ్ తన సినీ కాంపౌండ్ దాటి తీసిన చిత్రంగా “కాలాంతకులు” చిత్రాన్ని పేర్కొనవచ్చు. తాను రూపొందించిన చిత్రాలకు భిన్నంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది.
Sri Devi:ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందాల తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగులోను తమిళ హిందీ భోజ్ పురి వంటి ఎన్నో భాషలలో హీరోయిన్ గా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేస్తూ సినిమాలలో నటించే శ్రీదేవి ఆకాలమరణం ఇండియన్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
Advertisement
ఈమె 2018 ఫిబ్రవరి నెలలో దుబాయ్ లోని ఒక హోటల్లో బాత్ టబ్లో పడి మరణించారు అయితే ఈమె మరణం గురించి మాత్రం ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఉన్నాయని చెప్పాలి ఇలా బాత్ టబ్ లో పడి మరణించడం ఏంటి అంటూ ఎంతో మంది ఈమె మరణం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బోనీ కపూర్ శ్రీదేవి గురించి పలు విషయాలు తెలియజేశారు. శ్రీదేవి ఏదైనా ఒక పాత్రకు కమిట్ అవ్వాలి అనుకుంటే తన శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగానే మలుచుకునేది అందుకు సంబంధించి ఎన్నో రకాల వ్యాయామాలు వర్కౌట్స్ డైట్ ఫాలో అయ్యేది. ఇక శ్రీదేవి ఏం తిన్నా కూడా ఉప్పు లేకుండా చూసుకునేది తద్వారా తనకు లో బీపీ కూడా ఉంది ఇక క్రాస్ డైట్ ఫాలో అయ్యేది.
Sri Devi : డైట్ ఫాలో అయ్యేది..
ఇలా అందం కోసం అలాగే తన పాత్రకు అనుగుణంగా శరీర ఆకృతి కోసం ఎంతో కఠినతరమైన వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం పై పూర్తిగా శ్రద్ధ వహించేది కాదని ఇలా తన ఆరోగ్యం పై అశ్రద్ధ వహించడం వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Nagachaitanya: త్వరలోనే అక్కినేని నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు సమంతకు విడాకులు ఇచ్చేసిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు డిసెంబర్ 4వ తేది వీరి పెళ్లి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Advertisement
ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నాగచైతన్య శోభిత పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేశారని సమాచారం. ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు పెళ్లి వేడుకలు ఇలా భారీ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత పెళ్లి వేడుకను కూడా నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.
Nagachaitanya: 50 కోట్లు..
ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నెట్ ఫ్లిక్స్ సుమారు 50 కోట్లకు వీరి వెడ్డింగ్ రైట్స్ కొనుగోలు చేశారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఇటు అక్కినేని కుటుంబం అటు ధూళిపాళ్ళ కుటుంబం కూడా స్పందించలేదు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగచైతన్య శోభిత వివాహం కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు స్నేహితుల సమక్షంలో జరగబోతుందని ఇటీవల నాగార్జున వెల్లడించిన సంగతి తెలిసిందే.
Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక నేడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు అంటే అందుకు కారణం నాగబాబు అని కూడా చెప్పాలి.
Advertisement
ప్రతిక్షణం పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ ఆయన విజయానికి కారణమయ్యారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతంలో కూటమినేతలు భారీ మెజారిటీతో గెలిచారు.
Nagababu: గేమ్ ఛేంజర్..
ఈ క్రమంలోనే పవన్ పేరు దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలోనే పవన్ సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రతి నాయకుడు హీరో అవుతాడు కానీ ప్రతి హీరో నాయకుడు కాలేరు. నాయకుడు అంటే నమ్మిన సిద్ధాంతాలను సైధ్దాంతిక విలువల కోసం. అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం. నీడై నిలబడేవాడు. తోడై నడిపించేవాడు. వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు. వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు.ప్రస్తుతం దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. ఇలా పవన్ గురించి నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.