Actress Hema: భోజనం చేద్దామని కూర్చుంటే తీవ్రంగా అవమానించాడు… ఎప్పటికీ ఆ అవమానం మర్చిపోలేను: నటి హేమ

Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కగా, పిన్నిగా, వదినగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి హేమ గురించి అందరికీ తెలిసిందే. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న హేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు.

Actress Hema: బట్టలు మార్చుకోవాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉండేది… ఇప్పటికీ ఆ అవమానం మర్చిపోలేను: నటి హేమ

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ కెరియర్ మొదట్లో ప్రొడక్షన్ బాయ్స్ చిన్న ఆర్టిస్టులను చాలా చులకనగా చూసేవారని… ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కేరవాన్ సదుపాయం ఉందని అప్పట్లో ఏ విధమైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.

Actress Hema: బట్టలు మార్చుకోవాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉండేది… ఇప్పటికీ ఆ అవమానం మర్చిపోలేను: నటి హేమ

షూటింగ్ లొకేషన్ లో బట్టలు మార్చుకోవాలన్నా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని… అప్పుడు ఇలాంటి వసతులూ ఉండేవి కాదని తెలిపారు.ఈ క్రమంలోనే భారతనారి అనే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అందరితో కలిసి భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్ వచ్చి మీరు ఇక్కడ కాదు భోజనం చేయాల్సింది అక్కడికి వెళ్లి భోజనం చేయండి అంటూ అందరి ముందు తనని అవమాన పరిచారని హేమ గత సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

భోజనం చేస్తుండగా పైకి లేపారు…

ఈ విధంగా భోజనం ముందు నుంచి లేపడంతో చాలా కోపం వచ్చిందని ఏకంగా టేబుల్ ఎత్తి తనపై వేద్దామా అని కోపంతో రగిలిపోయానని ఎప్పటికైనా వీరందరితో పాటు కలిసి భోజనం చేయాలని ఎంతో కష్టపడ్డానని హేమ తెలియజేశారు.అయితే ఇప్పటికి ఆ ప్రొడక్షన్ బాయ్ ఇండస్ట్రీలో ఉన్నారని కానీ ఒక సినిమా షూటింగ్ సమయంలో తనే స్వయంగా వచ్చి నాకు భోజనం కూడా వడ్డించారని తెలిపారు. ఇలా ఈ చేదు సంఘటనలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని హేమ తెలియజేశారు.