Pawan Kalyan: పవన్ మాటలకు యూటర్న్ తీసుకున్న పిఠాపురం రాజకీయం.. మొదలైన కొత్త తలనొప్పి!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు తనకు తలనొప్పిగా మారుతున్నాయి తాజాగా పిఠాపురంలో నిర్వహించినటువంటి సభలో భాగంగా ఈయన తాను కేంద్రం ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనంటూ కామెంట్లు చేశారు. నిజానికి ఇక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం లోకల్ టిడిపి నేత వర్మకు ఏమాత్రం ఇష్టం లేదు.

పవన్ కళ్యాణ్ కు టికెట్ ప్రకటించడంతో తాను టిడిపి పార్టీ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు పిలిచి తనని బుజ్జగించి ఎమ్మెల్సీలో పదవి ఇస్తానని చెప్పి జనసేనకు సపోర్ట్ చేయాలని కోరారు. దీంతో వర్మ జనసేనకు మద్దతుగా తెలుపుతున్నారు. ఇద్దరు కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాను కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేయవచ్చు అంటూ కామెంట్లు చేశారు.

పిఠాపురం టికెట్ నాదే..
ఒకవేళ నేను కాకినాడ వెళ్లాల్సి వస్తే ఈ ప్లేస్ లో ఉదయ్ పోటీ చేస్తారు అంటూ ఈయన తెలిపారు. దీంతో వర్మ యూటర్న్ తీసుకున్నారు. ఒకవేళ ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకుంటే ఈ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా వేరే వాళ్ళు నిలబడటానికి లేదని తానే పోటీ చేస్తాను అంటూ భీష్ముంచుకు కూర్చున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎంతో బాధతో స్థానాన్ని వదులుకున్నానని.. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం టికెట్ తనదేనని అన్నారు.