చలికాలంలో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా?

చలికాలంలో మనం మన జుట్టు, చర్మంతోపాటు గా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. చలికి చర్మం పొడిబారటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చలికాలం అనగానే అందరూ వేడివేడిగా కాఫీలు, టీలు, వేడివేడిగా బజ్జీలు లాంటివి తినాలి అనుకుంటారు.వింటర్ సీజన్లో శరీరాన్ని పచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అన్ని సీజన్లలో పాటు ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. చలికాలంలో అందంతో పాటు, ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి అంటున్నారు పరిశోధకులు.చలికాలం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం..

రోజు ఒక యాపిల్ తినడం వలన మనం డాక్టర్ దగ్గరకు తరచుగా వెళ్లాల్సిన పని ఉండదు.ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా యాపిల్ తొక్కలో ఎక్కువగా పీచు, ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి.సిట్రస్ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడతాయి. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

నారింజ, ద్రాక్షపండు, కివీ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చలి కాలంలో బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఫోలేట్, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలోనూ సహయపడతాయి.చర్మ సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఆహారంలో అల్లం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

అల్లం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.అవకాడో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఒమేగా 3, విటమిన్ బి, బి6, ఇ, సి, కె, పాంటోథెనిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు ఇందులో ఉన్నాయి.