Featured
Pawan Kalyan -Ali: పవన్ కళ్యాణ్ అందుకే పెళ్లికి రాలేదు… విమర్శలకు చెక్ పెట్టిన అలీ!
Published
2 years agoon
By
lakshanaPawan Kalyan -Ali:టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సంపాదించుకున్న అలీ కుమార్తె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇక ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాలేకపోయారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహానికి హాజరు కాకపోవడంతో వీరిద్దరి మధ్య రాజకీయపరంగా విభేదాలు తల్లితాయని వీరి స్నేహం చెడింది అంటూ పెద్ద ఎత్తున ఆలీ పవన్ కళ్యాణ్ స్నేహబంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఇలా అలీ పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించి తమ గురించి వస్తున్నటువంటి విమర్శలకు పుకార్లకు క్లారిటీ ఇచ్చారు.అలీ తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించానని అయితే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా రూట్ మ్యాప్ చెక్ చేసుకుని వెళ్లారని తెలియజేశారు.
Pawan Kalyan -Ali: పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు…
పవన్ కళ్యాణ్ పెళ్లికి రావాలని బయలుదేరే ముందుగా ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతోనే ఆయన తన కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారంటూ ఈ సందర్భంగా అలీ తెలియజేశారు.ఇక పవన్ కళ్యాణ్ పెళ్లికి రాలేకపోవడంతో స్వయంగా తనకు ఫోన్ చేసి త్వరలోనే తాను తన కుమార్తె అల్లుడిని ఆశీర్వదిస్తానని త్వరలోనే కలుస్తానని కూడా చెప్పారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి తను తన కుమార్తె వివాహానికి రాకపోవడం గురించి అలీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
You may like
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
Pawan Kalyan: మరో పదేళ్లు మా బాబు గారే సీఎం… చంద్రబాబుపై పవన్ కామెంట్స్ వైరల్!
A.R Rehaman: విడాకుల ప్రకటనతో షాక్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్.. ముక్కలైన హృదయాలు అంటూ?
Meenakshi Chowdary: అక్కినేని హీరోతో పెళ్లి స్పందించిన మహేష్ హీరోయిన్.. ఏమన్నారంటే?
Featured
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
Published
4 mins agoon
22 November 2024By
lakshanaRoja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ వైకాపా నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్లనులెక్క పెట్టాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే వివి ప్యాట్లను లెక్క పెట్టాలని చెప్పినప్పటికీ అప్పటికే వివి ప్యాట్లను నాశనం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సంచలన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికలు జరిగినా 6 నెలల వరకు ఈ వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా భద్రపరచాలి కానీ ఎన్నికలు జరిగినా నెలలోపు ఈ వివి ప్యాట్లను నాశనం చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కుట్ర జరిగిందోనని ఈమె తెలిపారు.
Roja: ఈవీఎం మాయ..
ఇకపోతే ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాలు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో కూడా అదే ఓట్లు తేలాల్సి ఉంటుంది కానీ ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఈవీఎం ప్రభుత్వమని అర్థమవుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!
Published
4 hours agoon
22 November 2024By
lakshanaABV: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవల జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు గురించి విమర్శలు వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారన్నారు.
అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, నియమించారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను ఉచ్చరించి ఏక వచనంతో జగన్ సంభోదించారు.
ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టుల పర్వం సాగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించి సోషల్ మీడియా వేదికగా జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. ముందు మీ మాట మీ భాష సరి చేసుకో. ఒకసారి ప్రజలలో విశ్వాసం కోల్పోయిన మాట జారిన వెనక్కి తిరిగి తీసుకురాలేము.
ABV: సంస్కారం లేకుండా..
నీలాగా సంస్కారం లేకుండా నేను మాట్లాడలేను నేనేంటి అనేది గత ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చూసావు. బి కేర్ఫుల్ అంటూ ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు. మీరూ నన్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని అది పూర్తిగా అబద్ధం అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.
Featured
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Published
4 hours agoon
22 November 2024By
lakshanaGarikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన తన ప్రవచన ప్రసంగాలలో భాగంగా సినిమా సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఈయన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే తగ్గేదేలే అనే డైలాగ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అల్లు అర్జున్ తగ్గేదిలే అంటూ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది ప్రస్తుతం ఎవరు చూసినా ఇదే మేనరిజని ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ పాత్రలో కనిపించడంతో గరికపాటి ఈ సినిమా గురించి మాట్లాడితే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
స్మగ్లింగ్ వాళ్లను హీరోల్లా చేశారని.. అన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గెదేలా అంటాడా.. కుర్రాళ్లు ఇటీవల తగ్గెదెలా అంటున్నారు.. ఈ డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఈ సినిమా చేసిన దర్శకుడు హీరోలను కడిగిపారేస్తానంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Garikapati: స్మగ్లర్..
సత్య హరిశ్చంద్రుడు.. శ్రీరాముడు లాంటి వారు మంచి పనులు చేస్తారు.. వారు అలాంటి వ్యాఖ్యలు చేసిన దానికి ఒక అందముంటుందన్నారు. తొక్కలో స్మగ్లర్ ఈ డైలాగ్ లు వాడటమేంటని ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడటంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. సినిమాని సినిమా లాగా చూస్తే ఇలాంటి ఆలోచనలు రావు అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Posani: రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పోసాని.. జగనన్న క్షమించు అంటూ?
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured4 weeks ago
Chandra Babu Naidu: పొత్తు ఆలోచన ఎవరిది… జైలు గోడల మధ్య జరిగింది ఇదేనా?
- Featured4 weeks ago
AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?